Advertisement

వైద్యంపై పర్యవేక్షణ

Jun 30 2020 @ 06:17AM

ప్రత్యేక అధికారుల నియామకం

నియోజకవర్గానికో సెక్టోరల్‌ హెల్త్‌ అధికారి


(పార్వతీపురం):  కరోనా కేసులు.. అందుతున్న సేవలు.. చికిత్స తీరుతెన్నులు.. సీజనల్‌ వ్యాధులు.. నియంత్రణకు వైద్యులు అనుసరిస్తున్న విధానాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అన్ని రకాల వైద్యాన్ని మెరుగు చేసేందుకు చర్యలు చేపట్టింది. ప్రధానంగా సేవలపై పర్యవేక్షణను పెంచుతోంది. నియోజకవర్గానికో సెక్టోరల్‌ హెల్త్‌ అధికారిని నియమించింది. ప్రభుత్వ ఆదేశంపై కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ విధివిధానాలను రూపొందించారు.


తొమ్మిది నియోజకవర్గాలకు ప్రత్యేక అధికారులుగా వైద్యశాఖకు చెందిన అధికారులను, వివిధ పీహెచ్‌సీల వైద్యాధికారులను నియమించారు. వీరిని సెక్టోరల్‌ హెల్త్‌ అధికారులుగా పిలువనున్నారు.  వీరు నియోజకవర్గానికి చెందిన పీహెచ్‌సీ, సీహెచ్‌సీల ద్వారా ప్రజలకు అందుతున్న వైద్య సేవలు, అవసరమైన సదుపాయాలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. ప్రధానంగా కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలపై దృష్టి సారించాలి. వారానికి ఒకసారి సమగ్ర నివేదికను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారికి అందించాలి.


తొమ్మిది మంది ఎస్‌హెచ్‌వోల వివరాల్లోకి వెళ్తే..పార్వతీపురం నియోజకవర్గానికి ఐటీడీఏ డిప్యూటీ డీఎంఅండహెచ్‌వో డాక్టర్‌ ఎంఎం రవికుమార్‌రెడ్డిని నియమించారు. ఆయన పార్వతీపురం నియోజకవర్గ పరిధిలోని పార్వతీపురం, సీతానగరం, బలిజిపేట మండలాల పరిధిలో ఉన్న బందలుప్పి, డోకిశీల, పెదబొండపల్లి, సీతానగరం, పెదంకలాం, బలిజిపేట, అరసాడ, గళావల్లి పీహెచ్‌సీలను పర్యవేక్షించాలి. 


కురుపాం నియోజకవర్గానికి ఇద్దరు సెక్టోరల్‌ హెల్త్‌ అధికారులను నియమించారు. కొమరాడ పీహెచ్‌సీ వైద్యాధికారి జగన్మోహన్‌రావు, బందలుప్పి పీహెచ్‌సీ వైద్యాధికారి తిరుమలప్రసాద్‌ను కేటాయించారు. 


సాలూరు నియోజకవర్గానికి బొబ్బిలి పీపీయూకు చెందిన డాక్టర్‌ శివకుమార్‌,  బొబ్బిలికి స్థానిక పీపీ యూనిట్‌  వైద్యాధికారి విజయ్‌మోహన్‌, చీపురుపల్లికి అడిషనల్‌ డీఎంహెచ్‌వో డాక్టర్‌ జె.రవికుమార్‌, ఎస్‌.కోటకు డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్‌ చామంతి, నెల్లిమర్లకు డాక్టర్‌ టీవీ బాలమురళీ, గజపతినగరానికి జిల్లా ఇమ్యూనైజేషన్‌ అధికారి డాక్టర్‌ ఐ.ఈశ్వరిదేవి నియమించారు. వీరంతా కొవిడ్‌-19కు సంబంధించి ఫీవర్‌ సర్వైలెన్స్‌ స్టాటస్‌, ఫీవర్‌ క్లీనిక్స్‌ ఇన్‌ కంటైన్‌మెంట్‌ జోన్స్‌, హోం క్వారెంటైన్‌ మానిటరింగ్‌,, ఐఎంఎస్‌ రిపోర్టు, స్వాబ్‌ కలెక్షన్‌ తదితర అంశాలతో పాటు ఇమ్యూనిజేషన్‌ ప్రోగ్రాం, సీజనల్‌ వ్యాధుల పరిస్థితి, ఆర్‌బీఎస్‌కే, ఎన్‌టీఈపీ, ఆశా వర్కర్లకు శిక్షణను కూడా పర్యవేక్షిస్తారు. 

Follow Us on:
Advertisement
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.