టీడీపీలో జోష్‌

ABN , First Publish Date - 2021-06-13T05:15:41+05:30 IST

పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా.. టీడీపీ అధిష్ఠానం కమిటీలను నియమించింది. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కమిటీలను నియమిస్తూ.. రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు పార్టీ పరంగా ఉత్తర్వులు విడుదల చేశారు. జిల్లాలోని 10 నియోజకవర్గాలు.. శ్రీకాకుళం, విజయనగరం, అరకు పార్లమెంట్‌ పరిధిలో ఉన్నాయి. శ్రీకాకుళం పార్లమెంట్‌ నియోజకవర్గంలో శ్రీకాకుళం, ఆమదాలవలస, నరసన్నపేట, టెక్కలి, ఇచ్ఛాపురం, పాతపట్నం, పలాస నియోజకవర్గాలు ఉన్నాయి. విజయనగరం పార్లమెంట్‌ పరిధిలో రాజాం, ఎచ్చెర్ల నియోజకవర్గాలు ఉన్నాయి. అరకు పార్లమెంట్‌ పరిధిలో పాలకొండ నియోజకవర్గం ఉంది. ఈ మేరకు అన్ని నియోజకవర్గాల్లోనూ పార్టీ కోసం పనిచేసిన నేతలకు ప్రాధాన్యమిస్తూ.. కమిటీలను నియమించారు. దీంతో తెలుగు తమ్ముళ్లలో సందడి కనిపిస్తోంది. కమిటీ సభ్యులు త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు. తమపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీకి పూర్వవైభవం తీసుకువచ్చే విధంగా పనిచేస్తామని స్పష్టం చేశారు.

టీడీపీలో జోష్‌
కూన రవికుమార్‌, కిమిడి నాగార్జున, గుమ్మిడి సంధ్యారాణి

పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా కమిటీల నియామకం

‘శ్రీకాకుళం’ పార్టీ అధ్యక్షుడిగా కూన రవికుమార్‌ కొనసాగింపు

యథాతథంగా విజయనగరానికి కిమిడి నాగార్జున..

‘అరకు’ బాధ్యతలు గుమ్మిడి సంధ్యారాణికి అప్పగింత

(శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి/ఎచ్చెర్ల/పాలకొండ) 

పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా.. టీడీపీ అధిష్ఠానం కమిటీలను నియమించింది. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కమిటీలను నియమిస్తూ.. రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు పార్టీ పరంగా ఉత్తర్వులు విడుదల చేశారు. జిల్లాలోని 10 నియోజకవర్గాలు.. శ్రీకాకుళం, విజయనగరం, అరకు పార్లమెంట్‌ పరిధిలో ఉన్నాయి. శ్రీకాకుళం పార్లమెంట్‌ నియోజకవర్గంలో శ్రీకాకుళం, ఆమదాలవలస, నరసన్నపేట, టెక్కలి, ఇచ్ఛాపురం, పాతపట్నం, పలాస నియోజకవర్గాలు ఉన్నాయి. విజయనగరం పార్లమెంట్‌ పరిధిలో రాజాం, ఎచ్చెర్ల నియోజకవర్గాలు ఉన్నాయి. అరకు పార్లమెంట్‌ పరిధిలో పాలకొండ నియోజకవర్గం ఉంది. ఈ మేరకు అన్ని నియోజకవర్గాల్లోనూ పార్టీ కోసం పనిచేసిన నేతలకు ప్రాధాన్యమిస్తూ.. కమిటీలను నియమించారు. దీంతో తెలుగు తమ్ముళ్లలో సందడి కనిపిస్తోంది. కమిటీ సభ్యులు త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు. తమపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీకి పూర్వవైభవం తీసుకువచ్చే విధంగా పనిచేస్తామని స్పష్టం చేశారు. 


శ్రీకాకుళం పార్లమెంట్‌ కమిటీ  

- శ్రీకాకుళం పార్లమెంట్‌ టీడీపీ అధ్యక్షుడిగా కూన రవికుమార్‌నే కొనసాగించారు. 

- ఉపాధ్యక్షులుగా నర్తు పురుషోత్తం, పోతనాపల్లి సాంబమూర్తి, బలగ నాగేశ్వరరావు, చిట్టి మోహన్‌, హనుమంతు రామకృష్ణ, పీఎంజే బాబులను నియమించారు. 

- ప్రధాన కార్యదర్శిగా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ పీరుకట్ల విఠల్‌రావు, కార్యాలయ కార్యదర్శిగా మొదలవలస రమేష్‌లను నియమించారు.  

- అధికార ప్రతినిధులుగా సీపాన వెంకటరమణ, నందివాడ గోవిందరావు, సురవరపు తిరుపతిరావు, శివ్వాల బాబుకిషోర్‌, ముద్దాడ కృష్ణమూర్తినాయుడు, వెలమల కామేశ్వరరావు, దాసరి తాతారావు, కొత్తపల్లి అప్పలరాజులను నియమించారు. 

- కార్యనిర్వాహక కార్యదర్శులుగా సనపల ఢిల్లీశ్వరరావు, గాలి కృష్ణారావు, కర్రి అప్పారావు, మైలపల్లి త్రినాథరావు, అరవలస రవీంద్ర, పోలాకి చంద్రశేఖరరావు, సీపాన శ్రీరంగ నాయకులు, సబ్బి జానకిరావు నియమితులయ్యారు.

- కార్యద్శలుగా తమ్మినేని గంగారాం, నగాలు అప్పన్న, పూతి రమణ, మైలపల్లి నర్శింగరావు, చిడపాన ధర్మార్జునరెడ్డి, దేవాది సింహాద్రమ్మ, సవర ఆనందరావు, దువ్వారి ఉదయభాస్కరరావులను నియమించారు.

- కోశాధికారిగా ఇప్పిలి తిరుమలరావు, మీడియా కో ఆర్డినేటర్‌గా జామి భీమశంకర్‌, ఐ-టీడీపీ కో ఆర్డినేటర్‌గా ప్రధాన విజయరామ్‌లను నియమించారు. 


 విజయనగరం పార్లమెంట్‌ కమిటీ   

విజయనగరం పార్లమెంట్‌ కమిటీ అధ్యక్షుడిగా కిమిడి నాగార్జున(చీపురుపల్లి)ను నియమించారు.  ఉపాధ్యక్షులుగా ఆకిరి ప్రసాదరావు (నెల్లిమర్ల), కొరుప్రోలు రమేష్‌కుమార్‌ (గజపతినగరం), మడక తిరుపతిరావు (బొబ్బిలి), గురవాన నారాయణరావు (రాజాం), బల్లాడ వెంకట రమణా రెడ్డి (ఎచ్చెర్ల మాజీ ఎంపీపీ), ప్రధాన కార్యదర్శిగా ఐవీపీ రాజు (విజయనగరం), కార్యాలయ కార్యదర్శిగా పూనంచంద్‌ చౌదరి (విజయనగరం) నియమితులయ్యారు. 

అధికార ప్రతినిధులు

కనకల మురళీమోహన్‌ (విజయనగరం),  గేదెల రాజారావు (నెల్లిమర్ల), బండారు బాలాజీ (గజపతినగరం), పువ్వల శ్రీనివాసరావు (బొబ్బిలి), రౌతు కామునాయుడు (చీపురుపల్లి), వంగా వెంకటరావు (రాజాం), పైడి ముఖలింగం (ఎచ్చెర్ల-ఫరీద్‌పేట మాజీ ఎంపీటీసీ), కార్యనిర్వాహక కార్యదర్శులుగా వేచలపు శ్రీను (విజయనగరం), కలిదిండి వీఎస్‌ రాజు (నెల్లిమర్ల), గుంటురోతు గోవింద్‌ (గజపతినగరం), మర్రాపు యుగంధర్‌ (బొబ్బిలి), తిరుమలరాజు కిరణ్‌కుమార్‌ (చీపురుపల్లి), గరుగుబిల్లి రాణాప్రతాప్‌ (రాజాం), పైడప్పడు దొర (ఎచ్చెర్ల), కార్యదర్శులుగా ముద్దాడ చంద్రశేఖర్‌ (విజయనగరం), లెంక అప్పలనాయుడు (నెల్లిమర్ల), గుషిణి జగన్నాఽథం (గజపతినగరం), కాకల వెంకటరావు (బొబ్బిలి), పొలిపర్తి స్వామినాయుడు (గజపతినగరం), పిన్నింటి మోహనరావు (రాజాం), లెంక నారాయణరావు (ఎచ్చెర్ల), గొర్లె శ్రీనివాసరావు (నెల్లిమర్ల), కోశాధికారిగా లంక శ్యామ్‌ (ఎచ్చెర్ల)లను నియమించారు. 

 మీడియా కోఆర్డినేటర్‌గా బొద్దుల నర్సింగరావు, ఐ కో-ఆర్డినేటర్‌గా కె.విమలారాణి(చీపురుపల్లి) నియమితులయ్యారు. 


 అరకు పార్లమెంట్‌ కమిటీ   

అరకు పార్లమెంట్‌ అధ్యక్షురాలిగా గుమ్మిడి సంధ్యారాణి (సాలూరు) నియమితులయ్యారు. ఉపాధ్యక్షులుగా గెద్ద అన్నవరం (సాలూరు), గొట్టాపు వెంకటనాయుడు (పార్వతీపురం), నాగిరెడ్డి మధుసూధనరెడ్డి (కురుపాం), ఎం.వ రహాలరాజు (పాడేరు), పల్లా కొండలరావు (పాలకొండ), ప్రధాన కార్యదర్శిగా కిడారి శ్రావణ్‌కుమార్‌ (అరకు వ్యాలీ), కార్యాలయ కార్యదర్శిగా దంతులూరి శివరామరాజు (రంపచోడవరం)లను నియమించారు.  


అధికార ప్రతినిధులు 

అట్యాన వెంకట తిరుపతిరావు (సాలూరు), రెడ్డి శ్రీనివాసరావు (పార్వతీపురం), డొంకాడ రామకృష్ణ (కురుపాం), గంగపుజారి శివకుమార్‌ (పాడేరు), భూపతి ఆనందరావు (పాలకొండ), బకురు వెంకటరామరాజు (అరకు వ్యాలీ), వేదవల్లి భాస్కరరావు (రంపచోడవరం), పిన్నింటి ఈశ్వరరావు (సాలూరు), మజ్జి కృష్ణమోహన్‌ (పార్వతీపురం)ను నియమించారు.  

కార్యనిర్వాహక కార్యదర్శులు 

పండి శాస్త్రిబాబు (అరకు వ్యాలీ), మొదిలి విజయాంకుశం (కురుపాం), చాలంగి జ్ఞానేశ్వరి (పాడేరు), సవర మాలయ్య (పాలకొండ), సంఘం శ్రీకాంత్‌ (రంపచోడవరం) నియమితులయ్యారు.  

కార్యదర్శులు 

తెల్లా పోలినాయుడు (సాలూరు), మజ్జి అప్పారావు (పార్వతీపురం), నెగలి సుందరరావు (అరకు వ్యాలీ), తోయాక జగదీశ్వరి (కురుపాం), సుమర్ణ సాంబశివరావు (పాడేరు), పొన్నాడ నాగేశ్వరరావు (పాలకొండ), పెనుబాలి సాయిబాబు (రంపచోడవరం)లను నియమించారు. 

 కోశాధికారిగా ఉంతాల నాగేశ్వరరావు, మీడియా కోఆర్డినేటర్‌గా తొకల సత్తిబాబు, గొర్లె ముసలినాయుడు ఐటీ కోఆర్టినేటర్‌గా నియమితులయ్యారు. సభ్యుల నియామకంపై టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి నిమ్మక జయకృష్ణ, పాలకొండ పట్టణాధ్యక్షుడు గంటా సంతోష్‌కుమార్‌, జడ్పీటీసీ మాజీ సభ్యుడు సామంతుల దామోధరరావు, రాష్ట్ర కార్యదర్శి కర్నెన అప్పలనాయుడు, వారాడ సుమంత్‌ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. 

Updated Date - 2021-06-13T05:15:41+05:30 IST