Aadhaar-Voter ID link: హైకోర్టుకు వెళ్లమన్న సుప్రీంకోర్టు

ABN , First Publish Date - 2022-07-26T02:06:10+05:30 IST

ధార్‌తో ఓటర్ కార్డుల అనుసంధానం చేసే ఎలక్షన్ లా ఎమెండ్‌మెంట్ యాక్ట్‌ పై ఢిల్లీ హైకోర్టును..

Aadhaar-Voter ID link: హైకోర్టుకు వెళ్లమన్న సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: ఆధార్‌తో ఓటర్ కార్డుల అనుసంధానం (Aadhaar card-Voter ID linking) చేసే ఎలక్షన్ లా ఎమెండ్‌మెంట్ యాక్ట్‌ (Election Law amendment act)పై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాలని కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలాను సుప్రీంకోర్టు (Supreme court) సోమవారంనాడు ఆదేశించింది. ఈ చట్టం రాజ్యంగ విరుద్ధమని, వ్యక్తుల గోప్యత, సమానత్వం హక్కులను కాలరాస్తోందని సూర్జేవాలా తన పిటిషన్‌లో సూర్జేవాలా పేర్కొన్నారు. చట్టాన్ని సవాలు చేస్తూ అత్యున్నత న్యాయస్థానంలో ఆయన పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయమూర్తులు డీవై చంద్రచూడ్, ఏఎస్ బోపన్నతో కూడిన డివిజన్ బెంచ్... సూర్జేవాలా స్వేచ్ఛగా హైకోర్టుకు వెళ్లవచ్చని పేర్కొంది. హైకోర్టు ముందున్న సెక్షన్ 4, 5 సెక్షన్లను పిటిషనర్ సవాలు చేస్తున్నందున ఆర్టికల్ 226 ప్రకారం ఆయనకు హైకోర్టును ఆశ్రయించే స్వేచ్ఛ ఇస్తున్నట్టు బెంచ్ తన ఆదేశాల్లో తెలిపింది.


కాగా, ఎన్నికల సంస్కరణల్లో భాగంగా ఎలక్షన్ కమిషన్ ఎలక్టోరల్ డేటాను ఆధార్తో లింక్ చేయడం వల్ల ఒకే వ్యక్తి ఒకటికి మించి ఓట్లు నమోదుచేసుకోకుండా అడ్డుకోవచ్చని, ఆధార్ అనుసంధానం స్వచ్ఛందం మాత్రమేనని, తప్పనిసరి కానేకాదని కేంద్రం చెబుతోంది. ఆధార్ అనుసంధానం వల్ల బోగస్ ఓటర్లను తొలగించడం సులభమవుతుందని కేంద్రం చెబుతోంది. అయితే, ఆధార్-ఓటర్ అనుసంధానం వల్ల దేశంలో పౌరులు కాని వారే ఎక్కువ మంది ఓటేసే అవకాశం ఉందని ప్రతిపక్షాల వాదనగా ఉంది. ఈ క్రమంలో కాంగ్రెస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

Updated Date - 2022-07-26T02:06:10+05:30 IST