అమెరికా కాంగ్రెస్‌ సభ్యుడు కృష్ణమూర్తి కీలక ప్రకటన! సిక్కు మతస్థుల గౌరవార్థం..

ABN , First Publish Date - 2021-04-21T23:11:49+05:30 IST

అమెరికాలోని ఇల్లినాయ్‌ రాష్ట్రంలో ఏప్రిల్ నెలను ‘సిక్కు మతం అవగాహన మాసం’గా గుర్తిస్తున్నట్టు అమెరికా కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి ప్రకటించారు.

అమెరికా కాంగ్రెస్‌ సభ్యుడు కృష్ణమూర్తి కీలక ప్రకటన! సిక్కు మతస్థుల గౌరవార్థం..

వాషింగ్టన్: అమెరికాలోని ఇల్లినాయ్‌ రాష్ట్రంలో ఏప్రిల్ నెలను ‘సిక్కు మతం అవగాహన మాసం’గా గుర్తిస్తున్నట్టు అమెరికా కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి తాజాగా ప్రకటించారు. సిక్కు మతస్థుల సేవలను గుర్తించి ప్రసంశించాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అమెరికాలోని సిక్కు సమాజంపై జాతివిద్వేష దాడులు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో ఇది ఎంతో ఆవశ్యకమని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు అమెరికా ప్రతినిధుల సభలో కృష్ణమూర్తి పేర్కొన్నారు. ఇటువంటి గుర్తింపు ఇవ్వడానికి ఇదే సరైన సమయమని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. సిక్కు మతస్థులు 125 ఏళ్ల క్రితం అమెరికాలో అడుగుపెట్టారని, ఎన్నో సవాళ్లను, వివక్షను ఎదుర్కొంటూ వారు అమెరికా సమాజ అభ్యున్నతికి పాటుపడ్డారని కృష్ణమూర్తి పేర్కొన్నారు. ఏప్రిల్ 15న ఫెడరల్ ఎక్స్‌ప్రెస్ సంస్థ పరిసరాల్లో జరిగిన జాతివిద్వేష దాడిలో నలుగురు సిక్కు మతస్థులు మరణించిన విషయం తెలిసిందే. మృతుల్లో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. 

Updated Date - 2021-04-21T23:11:49+05:30 IST