రొయ్యకు.. చావు దెబ్బ

ABN , First Publish Date - 2020-11-26T05:30:00+05:30 IST

చావు బతుకుల మధ్య కొట్టు మిట్టాడుతన్న రొయ్యకు నివర్‌ తుఫాన్‌ మరణ శాసనం రాస్తోంది.

రొయ్యకు.. చావు దెబ్బ

కరోనా.. ఉష్ణోగ్రతలు.. తుఫాన్‌లు.. వరదలు

భీమవరం, నవంబరు 26 : చావు బతుకుల మధ్య కొట్టు మిట్టాడుతన్న రొయ్యకు నివర్‌ తుఫాన్‌ మరణ శాసనం రాస్తోంది. అసలే కరోనాతో ఈ ఏడాది ఎగుమతులు గణనీయంగా నిలిచిపోవడంతో రొయ్యల ధర పడిపోయింది. అధిక ఉష్ణోగ్రతలతో మే, జూన్‌ నెలల్లో సాగు అంతంతమాత్రంగానే జరిగింది. ఆ తర్వాత కురిసిన భారీ వర్షాలకు చెరువులన్నీ నీటిలో నిండిపోయి రొయ్యలన్నీ చాలా వరకు కొట్టుకుపో యాయి. కోట్లలో పెట్టుబడులు పెట్టిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. మళ్లీ ఇప్పుడిప్పుడే రొయ్య పిల్లలను కొనుగోలు చేసి సాగు ప్రారంభిస్తుండగా నివర్‌ తుఫాన్‌ రాకతో వాతావరణం ప్రతికూలంగా మారిపోయింది. దీంతో రైతులు విలవిల్లాడుతున్నారు. ఈ వాతావరణం ఎంత కాలం నడుస్తుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. రెండు మూడు రోజులు అయితే ప్రోబయోటిక్స్‌ ద్వారా కొంత వరకూ రొయ్యలను రక్షించుకునే అవకాశం ఉంది. కానీ తుఫాన్‌ తీవ్రత పెరిగితే మాత్రం తమ చేతుల్లో ఉండబోదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి పంట పట్ల నష్టాలను ప్రభు త్వ అధికారులు ఏ మాత్రం పట్టించుకోలేదని, నష్టపోయినట్లు ఏ ప్రజా ప్రతినిధి సీరియస్‌గా తీసుకోలేదు. ఇప్పుడు మరోసారి నష్టపోవడంతో నష్టపోయే పరిస్థితి రావడంతో రైతులు  తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2020-11-26T05:30:00+05:30 IST