జలకళ

ABN , First Publish Date - 2022-08-08T05:25:16+05:30 IST

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగులు వంక లు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు నిండి అలుగుపోస్తున్నాయి. అన్ని ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. ఇదిలా ఉండగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆదివారం కూడా వర్షం కురిసింది.

జలకళ
పూర్తిస్థాయిలో నిండి జలకళను సంతరించుకున్న బీబీనగర్‌ చెరువు

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు

అలుగుపోస్తున్న చెరువులు


యాదాద్రి, నల్లగొండ, సూర్యాపేట, ఆగస్టు 7(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగులు వంక లు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు నిండి అలుగుపోస్తున్నాయి. అన్ని ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. ఇదిలా ఉండగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆదివారం కూడా వర్షం కురిసింది. ఎగువన కురుస్తున్న వర్షాలకుతోడు సిద్ధిపేట జిల్లాలో కురుస్తున్న వానలకు రాజాపేట మండలంలోని కుర్రారం చెరువు శనివారం పూర్తిగా నిండి అలుగుపోసింది. దీంతో మత్తడి వద్ద గండి పడగా, దాన్ని పూడ్చేందుకు గ్రామస్థులు యత్నించినా నీరు వృథాగా పోతోంది. గతంలో చెరువుకు రూ.కోటి నిధులతో మరమ్మతులు చేపట్టినా నాణ్యతలో పించడంతో మత్తడి వద్ద గండిపడి పూర్తిగా కొట్టుకుపోయింది. మోత్కూరు మండలం సదర్శాపురం గ్రామంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు గోడలు తడిసి ఆదివారం తెల్లవారు జామున పర్రెపాటి పరమే్‌షకు చెందిన ఇల్లు కూలింది. పరమేష్‌ భార్యాపిల్లలు శనివారం రాత్రి ఊరికి వెళ్లగా పరమేష్‌ ఒక్కడే ఇంట్లో ఉన్నాడు. ఇల్లు పూర్తిగా కూలగా, అతడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఆ సమయంలో భార్యాపిల్లలు ఇంట్లో లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. గుండాల-గంగాపురం గ్రామాల మధ్య బ్రిడ్జి పైనుంచి నీటి ప్రవాహం ఉధృతంగా ఉండటంతో పోలీసులు అప్రమత్తమై ఆదివారం బ్యారీకేడ్లు ఏర్పాటు చేశారు.

 సూర్యాపేట జిల్లాలో 3.2మి.మీల వర్షపాతం నమోదు కాగా, అత్యధికంగా హుజూర్‌నగర్‌లో 17మి.మీలు, అత్యల్పంగా సూర్యాపేటలో 0.2మి.మీ వర్షపాతం నమోదైంది. నూతనకల్‌ మండల కేంద్రంతోపాటు పలు గ్రామాల్లో కురిసిన భారీ వర్షానికి చెరువులు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి. తాళ్లసింగారంలోని రామసముద్రం చెరువు అలుగు పారుతుండడంతో తాళ్లసింగారం-పాతర్లపహాడ్‌ గ్రామాల మధ్య రాకపోకలు నిలిచాయి. మాచనపల్లికి రెండువైపులా వాగులు పొంగిపొర్లడంతో గ్రామానికి ఇతర ప్రాంతాలతో ఆదివారం మధ్యాహ్నం వరకు రాకపోకలు నిలిచాయి. చెరువు అలుగునీటితో వరి, ఇతర పంటలకు నష్టం వాటిల్లింది. మోతె మండల పరిధిలోని నామవరం పెద్దచెరువు అలుగు ఉధృతికి నామవరం-గుంజలూరు వెళ్లే రహదారి వరద తాకిడికి కొట్టుకుపోయింది. దీంతో వ్యవసాయ పొలాలకు వెళ్లే రైతులు, కోదాడకు, సూర్యాపేట కలెక్టరేట్‌కు మండలం నుంచి రాకపోకలు నిలిచాయి. ఉర్లుగొండ-నర్సింహాపురం మధ్య ఉన్న బ్రిడ్జిపై నుంచి వరద వెళ్తోంది. వాగు వెంట ఉన్న సుమారు 400ఎకరాల్లోని వరి పంటలు నీట మునిగాయి. నల్లగొండ జిల్లాలో ఆకాశం మేఘావృతమై, అక్కడక్కడ చిరుజల్లులు కురిశాయి. రాత్రి వరకు వర్షం కురుస్తూనే ఉంది.


జిల్లాలో అలుగులు పోసిన 209 చెరువులు 

జిల్లాలో 209 చెరువులు నిండి అలుగుపోస్తున్నాయి. జూన్‌ నుంచి ఇప్పటివరకు 292.1మి.మీ సాధారణ వర్షపాతానికి 493.5మి.మీ వర్షపా తం నమోదైంది. 69శాతం అధికంగా వర్షాలు కురిశాయి. దీంతో జూలై నెలలోపే చెరువులన్నీ నిండాయి. గంధమల్ల చెరువు నిండి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. బిక్కేరు, చిన్నేటి వాగులు, మూసీ పరవళ్లు తొ క్కుతున్నాయి. జిల్లాలో మొత్తం 1010 చెరువులు ఉన్నాయి. వీటిలో ఇప్పటివరకు 209 చెరువులు అలుగు పోస్తున్నాయి. 0-25శాతం వరకు నీరుచేరిన చెరువులు 100 ఉండగా, 25-50శాతం నీరున్న చెరువులు 210,50-75శాతం నీరున్న చెరువులు 240, 75-100 నిండిన చెరువులు 251వరకు ఉన్నాయి. జిల్లాలోని అత్యధికంగా ఆలేరు, రాజపేట, తుర్కప ల్లి, బొమ్మలరామారం, గుండాల, బీబీనగర్‌ మండలాల్లో అధిక వర్షపా తం నమోదైంది. దీంతో ఈ మండల్లాల్లోని మెజార్టీ చెరువులు నిండాయి.


572అడుగులకు సాగర్‌ నీటిమట్టం

నాగార్జునసాగర్‌/కేతేపల్లి/చింతలపాలెం/డిండి, ఆగస్టు7: నా గార్జునసాగర్‌కు ఎగువ నుంచి వరద రాక కొనసాగుతోంది. ఎగువన ఉన్న శ్రీశైలం నుంచి సాగర్‌కు మొత్తం 1,47,115 క్యూసెక్కుల నీరు వస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు (312.0450టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 572.10 అడుగులకు(261.8411టీఎంసీలు) చేరుకుంది. సాగర్‌ నుంచి కుడి కాల్వ ద్వారా 2,236 క్యూసెక్కుల నీటిని, ఎడమ కాల్వ ద్వారా 2,712 క్యూసెక్కుల నీటిని, ప్రధాన జలవిద్యుత్‌ కేంద్రం ద్వారా 4,774 క్యూసెక్కుల నీటిని, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 1,800 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగ ర్‌ నుంచి మొత్తం 11,822 క్యూసెక్కుల నీరు విడుదలవుతుండగా, ఎగు వ నుంచి 1,47,115 క్యూసెక్కుల నీరు సాగర్‌కు వచ్చి చేరుతోంది. ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్‌లో ఆదివారం సెలవుదినం కావడంతో పర్యాటకుల సందడి నెలకొంది. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన పర్యాటకులు సాగర్‌లో ఉన్న బుద్ధవనం, అనుపు, ఎత్తిపోతల తదితర ప్రాంతాల్లో సందడి చేశారు. నూతన లాంచీ స్టేషన్‌నుంచి పర్యాటక శాఖ ఆధ్వర్యంలో మూడు జాలీ ట్రిప్పులు నడిపినట్లు పర్యాటక శాఖ అధికారులు తెలిపారు. 


మూసీకి పెరిగిన ఇన్‌ఫ్లో

మూసీ ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో మరోసారి పెరిగింది. హైదరాబాద్‌ నగరంతోపాటు ఎగువ మూసీ పరివాహక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో దిగువకు ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్టు క్రస్టుగేట్లను ఎత్తి వరద నీటిని దిగువ మూసీకి విడుదల చేస్తున్నారు. ఈక్రమంలో శనివారం సాయంత్రానికి 13,531 క్యూసెక్కులుగా ఉన్న ఇన్‌ఫ్లో ఆదివారం నాటికి 14,085 క్యూసెక్కులుగా నమోదైంది. మరోవైపు ప్రాజెక్టు నీటిమట్టాన్ని 638.70అడుగుల వద్ద నిలకడగా ఉంచుతున్న ప్రాజెక్టు ఇంజనీరింగ్‌ అధికారులు ఎగువ నుంచి వస్తున్న ఇన్‌ఫ్లోకు మించి 15,896 క్యూసెక్కుల వరద నీటిని ఆరు క్రస్టుగేట్లను నాలుగు అడుగులమేర ఎత్తి దిగువకు విడుదల చే స్తున్నారు. 645అడుగుల పూర్తిస్థాయి నీటిమట్టం కలిగిన మూసీ ప్రాజె క్టు ప్రస్తుత నీటిమట్టం 638.70అడుగులుగా ఉంది.4.49టీఎంసీల పూర్తి స్థాయి నీటినిల్వ సామర్థ్యంగల ప్రాజెక్టులో 2.93 టీఎంసీల నీరు ఉంది. 


పులిచింతల నుంచి కొనసాగుతున్న నీటి విడుదల 

పులిచింతల ప్రాజెక్టులో రెండు గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగుతోంది. ఎగువ నుంచి 17,500 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు రెండు గేట్లను ఒక మీటరు ఎత్తి 21,100క్యూసెక్కులు, పవర్‌ హౌస్‌లోని మూడు యూనిట్ల ద్వారా 10,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తూ 70 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నట్లు టీఎస్‌ జెన్కో ఎస్‌ఈ దేశ్యానాయక్‌ తెలిపారు. ప్రాజె క్టు పూర్తిస్థాయి నీటిమట్టం 175(45.77టీఎంసిలు)అడుగులు కాగా, ప్రస్తుతం 171.48(40.49టీఎంసిలు)అడుగులకు చేరింది.


35.8 అడుగులకు చేరిన డిండి నీటిమట్టం

డిండి ప్రాజెక్టు నీటిమట్టం ఆదివారం 35.8 అడుగులకు చేరింది. ప్రాజెక్టు గరిష్ఠ నీట్టిమట్టం 36అడుగులు(2.4 టీఎంసీలు) కాగా, ఆదివారం సాయంత్రానికి 35.8అడుగులకు చేరింది. ఇన్‌ఫ్లో 400క్యూసెక్కు లు కాగా, ఔట్‌ఫ్లో 150క్యూసెక్కులుగా ఉంది.

Updated Date - 2022-08-08T05:25:16+05:30 IST