భీమవరంలో మరో ఆక్వా వ్యాపారి ఐపీ

ABN , First Publish Date - 2021-09-19T05:14:23+05:30 IST

ఆక్వా రంగంలో మరో ఐపీ నమోదైం ది. చట్టం కల్పించిన అవకాశాన్ని వినియోగించుకుని భీమవరంలో ఒక వ్యాపారి ఇటీవలే ఐపీ ప్రకటించారు.

భీమవరంలో మరో ఆక్వా వ్యాపారి ఐపీ

భీమవరం, సెప్టెంబరు 18 : ఆక్వా రంగంలో మరో ఐపీ నమోదైం ది. చట్టం కల్పించిన అవకాశాన్ని వినియోగించుకుని భీమవరంలో ఒక వ్యాపారి ఇటీవలే ఐపీ ప్రకటించారు. సుమారు రూ.20 కోట్ల్లకు చేతులెత్తేసినట్టు తెలిసింది. రైతుల నుంచి సరుకు కొనుగోలు చేసే ట్రేడర్లు, కొన్ని ఎగుమతి సంస్థలు నష్టాలతో ఇలాగే ఐపీ పెట్టిన సం ఘటనలు గతంలో ఉన్నాయి. రెండు దశాబ్దాలలో ఇలా వెయ్యి కోట్లుపైనే ఎగవేతలు వున్నాయి. బాధితుల నుంచి ఫిర్యాదులు వస్తే తాజా ఐపీ బండారం బయటపడుతుంది. దీనిపై ఇప్పటికే పట్టణంలో చర్చ నడుస్తోంది. బాధితులు ఒక్కొక్కరుగా బయటపడుతున్నారు. 


Updated Date - 2021-09-19T05:14:23+05:30 IST