అరటికాయ పెరుగు పచ్చడి

ABN , First Publish Date - 2021-04-29T19:56:27+05:30 IST

అరటి కాయలు- మూడు, పెరుగు- ఒకటి న్నర కప్పు, చింతపండు- కొద్దిగ, పచ్చి మిర్చి- పది, కరివేపాకు - రెండు రెబ్బలు, ఉప్పు, నూనె- తగి నంత, పోపు గింజలు- ఓ స్పూను.

అరటికాయ పెరుగు పచ్చడి

కావలసిన పదార్థాలు: అరటి కాయలు- మూడు, పెరుగు- ఒకటి న్నర కప్పు, చింతపండు- కొద్దిగ, పచ్చి మిర్చి- పది, కరివేపాకు - రెండు రెబ్బలు, ఉప్పు, నూనె- తగి నంత, పోపు గింజలు- ఓ స్పూను.


తయారు చేసే విధానం: ఒక్కో అరటికాయని మూడు ముక్కలుగా కోసి ఉడికించాలి. ఓ పాన్‌లో నూనె వేసి పచ్చిమిర్చి, పోపు గింజలు, చింతపండు వేయించి గ్రైండ్‌ చేసి పెరుగులో కలపాలి. ఆ తర్వాత ఉప్పు జతచేయాలి. అరటికాయ ముక్కల తొక్క తీసి పెరుగులో వేసి గరిటతో బాగా కలపాలి. దీనికి జీలకర్ర, కరివేపాకు పోపు పెడితే అరటికాయ పెరుగు పచ్చడి సిద్ధం.

Updated Date - 2021-04-29T19:56:27+05:30 IST