Make India Strongest: మిస్డ్ కాల్ ఇవ్వండి : అరవింద్ కేజ్రీవాల్

Published: Fri, 19 Aug 2022 12:54:16 ISTfb-iconwhatsapp-icontwitter-icon
Make India Strongest: మిస్డ్ కాల్ ఇవ్వండి : అరవింద్ కేజ్రీవాల్

న్యూఢిల్లీ : భారత దేశాన్ని శక్తిమంతంగా తీర్చిదిద్దేందుకు మిస్డ్ కాల్ ఇవ్వాలని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ శిశోడియా (Manish Sisodia) ఇంట్లో శుక్రవారం సీబీఐ (కేంద్ర దర్యాప్తు సంస్థ -CBI) సోదాలు ప్రారంభమైన కొద్ది సేపటికి కేజ్రీవాల్ (Arvind Kejriwal) విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. 


కేజ్రీవాల్ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకొచ్చిన ఎక్సయిజ్ విధానంపై సీబీఐ సోదాలు శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యాయి. దీనికి సంబంధించి నమోదైన కేసు దర్యాప్తులో భాగంగా 20 చోట్ల సోదాలు జరుగుతున్నాయి. నూతన ఎక్సయిజ్ పాలసీలో అక్రమాలు ఉన్నట్లు ఓ దర్యాప్తు నివేదిక వెల్లడించడంతో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సీబీఐ దర్యాప్తునకు ఆదేశించారు. 


భారత దేశాన్ని నెంబర్ వన్‌గా తీర్చిదిద్దేందుకు 9510001000 ఫోన్ నంబరుకు మిస్డ్ కాల్ ఇవ్వాలని ప్రజలను కేజ్రీవాల్ కోరారు.  ఈ కార్యక్రమంలో పాల్గొనాలని  దేశ ప్రజలందరికీ  పిలుపునిచ్చారు. 


మనీశ్ శిశోడియా ప్రపంచంలో అత్యుత్తమ విద్యా శాఖ మంత్రి అని ప్రశంసిస్తూ ‘న్యూయార్క్ టైమ్స్’ ఓ వ్యాసాన్ని ప్రచురించిందని, ఇది చాలా గొప్ప విషయమని కేజ్రీవాల్  చెప్పారు. ఇటువంటి సమయంలో ఆయన ఇంటికి సీబీఐ వెళ్లిందన్నారు. చాలా అడ్డంకులు ఎదురవుతాయని, అయినా తమను ఎవరూ ఆపలేరని అన్నారు.  ‘న్యూయార్క్ టైమ్స్’ మొదటి పేజీలో రావడం సులువైన విషయం కాదన్నారు. ఢిల్లీలో విద్యా విప్లవాన్ని తేవడం కూడా సులువు కాదన్నారు. దేవుడు తమకు అండగా ఉన్నాడని చెప్పారు. శిశోడియాపైనా, ఇతర ఆమ్ ఆద్మీ పార్టీ నేతలపైనా చాలా తప్పుడు కేసులు ఉన్నాయన్నారు. 


రంగంలోకి రానున్న ఈడీ... 

ఇదిలావుండగా, మనీశ్ శిశోడియాపై సీబీఐ దాఖలు చేసే ప్రథమ సమాచార నివేదిక (FIR) ఆధారంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) కూడా ఆయనపై కేసును నమోదు చేసే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. 


ఢిల్లీ ఎక్సయిజ్ పాలసీలో అక్రమాలు జరిగినట్లు నమోదైన కేసులో ఢిల్లీ ఎక్సయిజ్ శాఖ మాజీ డిప్యూటీ కమిషనర్ ఆనంద్ కుమార్ తివారీ ఇంట్లో కూడా సీబీఐ సోదాలు జరుగుతున్నాయి. 


పాపాల పుట్ట పగులుతుంది : కాంగ్రెస్ 

మనీశ్ శిశోడియాపై సీబీఐ సోదాల నేపథ్యంలో కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్ స్పందిస్తూ, ఆప్, బీజేపీ మధ్య ఒప్పందం ఉన్నట్లు కాంగ్రెస్ ఎప్పుడూ అనుమానం వ్యక్తం చేస్తోందన్నారు. ఆప్ డబ్బులు సంపాదించి, కాంగ్రెస్‌ను దెబ్బతీస్తోందని, బీజేపీకి మద్దతిస్తోందని చెప్పారు. ఇప్పుడు ఆప్ అవసరం తమకు లేదని బీజేపీ భావించి ఉండవచ్చునన్నారు. అందువల్ల ఆప్ చేసిన పాపాలన్నీ బయటపడతాయన్నారు. ఇప్పుడు ఆప్‌తో బీజేపీ ఒప్పందం కుదుర్చుకుంటుందా? న్యాయం జరిగేలా చేస్తుందా? అనే అంశాన్ని చూడాలన్నారు. 


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

జాతీయంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.