కుమారస్వామి దర్శకత్వంలో ఆర్య

Jun 8 2021 @ 15:22PM

తమిళ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోల్లో ఆర్య ఒక‌డు. ఈయ‌న తెలుగులో వ‌రుడు చిత్రంలో విల‌న్‌గా న‌టించాడు. అలాగే సైజ్ జీరో చిత్రంతోనూ తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే.  ప్ర‌స్తుతం త‌మిళంలో ‘అరణ్‌మనై-3’ చిత్రంలో హాస్యాన్ని పండించనున్న ఆర్య.. ‘సార్బెట్టా’ చిత్రంలో మల్ల యుద్ధ వీరుడుగా, విశాల్‌ నటించే ‘ఎనిమి’ చిత్రంలో ప్రతి నాయకుడుగా నటిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ మూడు చిత్రాలు ఆర్యను సరికొత్త కోణంలో ఆవిష్కరించనున్నాయి. ఇదిలా ఉంటే, నలన్‌ కుమారస్వామి దర్శకత్వంలో  ఆర్య సినిమా చేయ‌బోతున్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన ప్ర‌క‌ట‌న వెలువ‌డుతుందని కోలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.