యథేచ్ఛగా అక్రమ కట్టడాలు

ABN , First Publish Date - 2022-01-21T05:57:32+05:30 IST

జోగుళాంబ గద్వాల జిల్లాలోని మునిసిపాలిటీల్లో అక్రమ కట్టాడాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి.

యథేచ్ఛగా అక్రమ కట్టడాలు
అయిజలో ఎక్స్‌కవేటర్‌తో ఇంటి నిర్మాణాన్ని కూల్చివేయిస్తున్న అధికారులు (ఫైల్‌)

- అనుమతులకు భిన్నంగా నిర్మాణాలు

- టాస్క్‌ఫోర్స్‌ కమిటీలు ఏర్పాటు చేసినా.. నామమాత్రపు ఫలితాలు

- కొత్త మునిసిపల్‌ చట్టంపై అవగాహన  కల్పించని అధికారులు

- అధికారుల నిర్లక్ష్యంతో ప్రభుత్వ ఆదాయానికి గండి

అయిజ టౌన్‌, జనవరి 20 : జోగుళాంబ గద్వాల జిల్లాలోని మునిసిపాలిటీల్లో అక్రమ కట్టాడాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. అక్రమ నిర్మాణా లను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త మునిసిపల్‌ చట్టాన్ని తీసుకువచ్చింది. ఈ చట్టంలో భాగంగా టాస్క్‌ఫోర్స్‌ కమిటీలు ఏర్పాటు చేసి అక్రమ కట్టడా లను నియంత్రించాలి. కొన్ని మునిసి పాలిటీల్లో కమిటీలు ఏర్పాటైనా ఆశించిన ఫలితాలు రావడం లేదు.  మరికొన్ని మునిసిపాలిటీల్లో కమి టీలే వేయలేదు.  ఇదే అదనుగా భావిస్తున్న  పైరవీకారులు ఇంటి నిర్మాణాలకు దొడ్డి దారిన అనుమతులు ఇప్పిస్తున్నారు. కానీ అనుమతులకు భిన్నంగా నిర్మాణాలు చేపడుతున్నారు. కొత్త ముని సిపాలిటీ చట్టం ప్రకారం అసెస్‌మెంట్‌ మేరకు అనుమతులు పొందినప్పుడు ఉన్న ఇంటి ప్లాన్‌ ప్రకారం నిర్మాణాలు లేకపోతే వాటిని కూల్చి వేయాలి. కానీ ఎక్కడా ఇలాంటి చర్యలు చేపట్టడం లేదు అనే ఆరోపణలు వస్తున్నాయి. గతంలో ఆయా మునిసిపా లిటీల్లో టౌన్‌ప్లానింగ్‌ విభాగం అనుమతుల మేరకు ఇంటి నిర్మాణాలు చేపట్టేవారు. నిబంధనల ప్రకారం ప్రభుత్వ స్థలాలు, చెరువులు, ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఉన్న భూముల్లో సదరు నిర్మాణం చేయకూడదు.  గతంలో అనుమతులు లేకున్నా నిర్మాణాలు చేపట్టడం, అను మతి తీసుకున్నా.. 10శాతం స్థలాన్ని వదలక పోవడం, నాలాలను అక్రమించడం వంటివి పరిపాటిగా నమోద య్యేవి.  వాటికి అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం టీఎస్‌ బీపాస్‌ విధానాన్ని తీసుకువచ్చింది. ఇందులో భాగంగా ఇంటి నిర్మాణం చేసుకుంటున్న యజమాని సెల్ఫ్‌ అసెస్‌మెంట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. సంబంధిత మునిసిపల్‌ అధికారులు వాటిని పరిశీలించి.. అసెస్‌మెంట్‌ సరిగా ఉంటేనే 21 రోజుల్లోగా అనుమతులు జారీ చేస్తారు. ఒకవేళ అసెస్‌మెంట్‌ ప్రకారం ఇంటి నిర్మాణం లేకపోతే..  చర్యలు తీసుకునేం దుకు రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ, అగ్నిమాపక, మునిసిపల్‌, పోలీస్‌శాఖకు చెందిన వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్‌ బృందం పరిశీలించి కూల్చివేస్తారు. ఈ చట్టం అమల్లోకి వచ్చి దాదాపు రెండేళ్లు అవుతోంది.  ఇప్పటివరకు గతంలో ఆక్రమించిన వాటితోపాటు ప్రస్తు తం అక్రమంగా నిర్మిస్తున్న భవన నిర్మాణాలను కూల్చి వేయడంలో ఆశించిన ఫలితాలు రావడం లేదు. దీనికి కారణం ఈ కమిటీలు అసలు పనిచేయడం లేదని తెలుస్తోంది. అలాగే టీఎస్‌ బీపాస్‌పై ప్రజలకు సరైన అవ గాహన కల్పించడంలో అధికారులు  విఫలమవుతు న్నారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో గద్వాల, అయిజ, అలంపూర్‌, వడ్డేపల్లి మునిసిపాలిటీలు ఉన్నాయి. నాలుగు మునిసిపాలిటీల్లో కొందరు వ్యక్తులు ఒక అం తస్తుకు అనుమతులు తీసుకొని రెండు, మూడు అంత స్తులు నిర్మిస్తున్నారు, ఇంటి నిర్మాణానికి అను మతులు తీసుకుని వ్యాపార సముదాయ నిర్మాణాలు చేపడుతు న్నారనే ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి.  మరి కొందరు నాలాలు, వాగు వంకల్లో నిర్మాణాలు చేపట్టినా అధికా రులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. అలంపూర్‌, వడ్డేపల్లి మునిసిపాలి టీలలో ఇప్పటి వరకు అక్రమ నిర్మాణాలను గుర్తించలే దు. ప్రజలకు కొత్త చట్టంపై అవగాహన కల్పించలేదు. టాస్క్‌ ఫోర్స్‌ టీమ్‌లు ఏర్పాటు చేయలేదు. గద్వాల మునిసిపాలిటీలో 31 అక్రమ నిర్మాణాలను గుర్తించి అయిదు నిర్మాణాలను కూల్చేశారు. మిగిలిన  వాటిని పరిశీలిస్తున్నట్లు అధికారుల ద్వారా తెలిసింది. అయిజలో 30 అక్రమ నిర్మాణాలను గుర్తించి 20  కూల్చేశారు. మిగిలినవి పరిశీలనలో ఉన్నాయి. 

 



Updated Date - 2022-01-21T05:57:32+05:30 IST