ఇష్టానుసారంగా పార్టీలో చేరికలు చెల్లవు

ABN , First Publish Date - 2022-06-27T07:01:20+05:30 IST

ఇష్టానుసారంగా పార్టీలో చేరికలు చెల్లవని డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్నయాదవ్‌ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఇష్టానుసారంగా పార్టీలో చేరికలు చెల్లవు
సూర్యాపేటలో మాట్లాడుతున్న చెవిటి వెంకన్నయాదవ్‌

డీసీసీ అఽధ్యక్షుడు చెవిటి వెంకన్నయాదవ్‌

సూర్యాపేట టౌన్‌, జూన్‌ 26: ఇష్టానుసారంగా పార్టీలో చేరికలు చెల్లవని డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్నయాదవ్‌ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ వ్యతిరేక కార్యక్ర మాలకు పాల్పడుతున్న వడ్డేపల్లి రవికుమార్‌ను 2018 నవంబరు నెలలో పార్టీ సస్పెండ్‌ చేసిందని, ఆరేళ్లపాటు బహిష్కరించిందని తెలిపారు. రవి కుమార్‌కు కాంగ్రెస్‌ పార్టీలో చేరాలన్న ఉత్సాహం ఉంటే టీపీసీసీకి దర ఖాస్తు చేసుకుంటే, దానిని ఏఐసీసీ క్రమశిక్షణ సంఘం, చేరిక కమిటీ చర్చించి నిర్ణయం తీసుకుంటుందన్నారు. రవికుమార్‌పై ఉన్న సస్పెన్ష న్‌ను ఎత్తివేసి పార్టీలోకి తీసుకోవాలని,  ఎవరు పడితే వారు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తే చెల్లదని తెలిపారు. ఈ విషయాన్ని చేరికల కమిటీ చైర్మన్‌ జానారెడ్డితోపాటు ఏఐసీసీ సభ్యులకు సమాచార మిచ్చా మని, ఆయన చేరిక చెల్లదని వారు స్పష్టం చేశారన్నారు. బహి ష్కరిం చిన కాంగ్రెస్‌ నాయకులను పార్టీలోకి చేర్చుకోవడం కాంగ్రెస్‌ పార్టీ సంస్కృతి కాదని, కాంగ్రెస్‌ పార్టీకి ఈ చేరికకు ఎలాంటి సంబంధం లేదన్నారు.

‘అగ్నిపథ్‌’ను నిరసిస్తూ నేడు శాంతి దీక్షలు 

సూర్యాపేట అర్బన్‌: భారత సైన్యంలో ‘అగ్నిపథ్‌’ ప్రక్రియను నిర సిస్తూ జిల్లా కేంద్రంలోని గాంధీ విగ్రహం ఎదుట కాంగ్రెస్‌ పార్టీ అధ్వర్యంలో సోమవారం శాంతి దీక్షలు చేపడుతున్నట్లు చెవిటి వెంకన్న యాదవ్‌ తెలిపారు.  జిల్లా కేంద్రంలోని రెడ్‌హౌజ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శాంతి దీక్షల్లో ప్రతీ కార్యకర్త పాల్గొని విజయవంతం చేయాలన్నారు.  కార్యక్రమంలో నాయకులు కొప్పుల వేణారెడ్డి, కోతి గోపాల్‌రెడ్డి, వీరన్ననాయక్‌, కక్కిరేణి శ్రీనివాస్‌, తంగెళ్ల  కర్ణాకర్‌రెడ్డి, నరేందర్‌నాయుడు, సంతోష్‌ పాల్గొన్నారు.





Updated Date - 2022-06-27T07:01:20+05:30 IST