యథేచ్ఛగా సాగుతున్న ఇసుక అక్రమ రవాణా

ABN , First Publish Date - 2021-01-13T05:18:52+05:30 IST

నిజామాబాద్‌ జిల్లాలో ఇసుకకు డిమాండ్‌ భారీ గా పెరిగింది. భవన నిర్మాణాలతో పాటు అభివృద్ధి పనులు కొనసాగుతుండడంతో ఎక్కువ మొత్తంలో వినియోగిస్తున్నారు. దీనిని ఆసరాగా చేసుకొని అక్ర మార్కులు వాగులు, మంజీర పరిధిలో అనుమతు లు లేకుండా భారీగా తవ్వకాలు చేస్తున్నారు. రాత్రి పూట డంప్‌ల నుంచి ఇసుకను తరలించి అమ్ముతున్నారు.

యథేచ్ఛగా  సాగుతున్న ఇసుక అక్రమ రవాణా
మంజీరా నది పరీవాహక ప్రాంతాల్లో కొనసాగుతున్న ఇసుక తవ్వకాలు (ఫైల్‌)

నిజామాబాద్‌ జిల్లాలో ఇసుకకు పెరిగిన డిమాండ్‌

రాత్రి వేళల్లో వాగుల్లో జోరుగా తవ్వకాలు

జిల్లాలో అన్ని ప్రాంతాలకు తరలింపు

రాజకీయ ఒత్తిళ్లతో చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు

నిజామాబాద్‌, జనవరి 12 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): నిజామాబాద్‌ జిల్లాలో ఇసుకకు డిమాండ్‌ భారీ గా పెరిగింది. భవన నిర్మాణాలతో పాటు అభివృద్ధి పనులు కొనసాగుతుండడంతో ఎక్కువ మొత్తంలో వినియోగిస్తున్నారు. దీనిని ఆసరాగా చేసుకొని అక్ర మార్కులు వాగులు, మంజీర పరిధిలో అనుమతు లు లేకుండా భారీగా తవ్వకాలు చేస్తున్నారు. రాత్రి పూట డంప్‌ల నుంచి ఇసుకను తరలించి అమ్ముతున్నారు. జిల్లాలో భారీ ఎత్తున ఇసుక తరలిపోతున్నా అధికారులు మాత్రం తమపై ఉన్న రాజకీయ ఒత్తిళ్ల తో చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. కొన్ని చోట్ల అభివృద్ధి పనులకు ఇచ్చిన అనుమతుల మీదనే అధి కారులకు తెలియకుండా భారీగా ఇతర ప్రాంతాలకు ఇసుకను చేరవేస్తున్నారు. జిల్లాలో ఇసుక అక్రమ ర వాణా గడిచిన కొన్ని రోజులుగా ఎక్కువగా జరుగుతోంది. అనుమతి పొందిన ఇసుక క్వారీలు లేకపోవ డం వల్ల అక్రమార్కుల జోరు పెరిగింది. మంజీర వెంట తవ్వకాలను అనుమతులు లేకుండానే కొనసాగిస్తున్నారు. రాత్రివేళల్లో ట్రాక్టర్‌లు, టిప్పర్‌లు, లారీ ల ద్వారా ఇతర ప్రాంతాలకు చేరవేస్తున్నారు. వీటితో పాటు పెద్దవాగు, పూలాంగ్‌ వాగుతో పాటు ఇతర వాగులలో తవ్వకాలు చేపట్టి ఇసుకను తరలిస్తున్నా రు. జిల్లాలోని కోటగిరి, బోధన్‌, నవీపేట, మాక్లూర్‌, ఆర్మూర్‌, డిచ్‌పల్లి, మోపాల్‌, ధర్పల్లి, భీమ్‌గల్‌, వే ల్పూర్‌, మోర్తాడ్‌ మండలాల పరిధిలోని వాగుల్లో ఎ క్కువగా ఇసుక తవ్వకాలు కొనసాగుతున్నాయి. గడిచిన కొన్ని రోజులుగా భవన నిర్మాణాలు పెరగడం వల్ల ఇసుకకు డిమాండ్‌ పెరిగింది. అనుమతి పొంది న క్వారీలు లేకపోవడం వల్ల టన్ను రూ.వెయ్యి నుం చి రూ.1,500 మధ్య అమ్మకాలు చేస్తున్నారు. లారీ ఇ సుకను రూ.25వేల నుంచి రూ.30 వేల మధ్య అ మ్ముతున్నారు. రాత్రివేళల్లో తవ్వకాలు చేస్తున్న వీరు అవసరం లేని సమయంలో ఇసుకను డంపులలో ని ల్వ చేస్తున్నారు. ఇతర  రోజుల్లో అవసరమైన వారికి  సరఫరా చేస్తున్నారు. ప్రభుత్వ అభివృద్ధి పథకాలకు ఈ ఇసుకను తహసీల్దార్‌లు అనుమతి ఇస్తున్నారు. బుధ, శుక్రవారాల్లో సమీప వాగుల్లో తవ్వకాలు చేసి తరలిస్తున్నారు. ఈ అనుమతులపైన కూడా ఇచ్చిన దానికంటే ఎక్కువ మొత్తంలో తవ్వకాలు చేసి ప్రైవేటుకు తరలిస్తున్నారు. కొన్ని చోట్ల అధికారులు పట్టుకుంటున్నా.. ఇసుక మాత్రం రవాణా ఆగడం లేదు. కొన్ని చోట్ల రాజకీయ ఒత్తిళ్లు ఉండడం వల్ల చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. అధికారులు కొన్ని లారీలను, ట్రాక్టర్‌లను సీజ్‌ చేసి కేసులు పెట్టినా ఫ లితం మాత్రం ఉండడం లేదు. మంజీరా పరిధిలో అనుమతులు మాత్రం ఇవ్వడం లేదు. గతంలో టీ ఎస్‌ఎండీసీ అనుమతులు ఇచ్చినా గడువు పూర్తి అ యింది. కొత్త క్వారీలకు మాత్రం అనుమతులు ఇవ్వ లేదు. దీనినే ఉపయోగించుకుంటున్న ఇసుక అక్ర మార్కులు తరలిస్తూ సొమ్ముచేసుకుంటున్నారు. కొ న్ని చోట్ల అధికారులతో ఒప్పందాలు చేసుకొని ఇసుక ను తరలిస్తున్నారు. వినియోగదారులకు అత్యవస రం ఇసుక కావలసి ఉండడంతో చెప్పిన ధరకు కొనుగోలు చేస్తున్నారు. ఉన్నతాధికారులు ఇసుక అక్రమ రవాణాపై అప్పుడప్పుడు దృష్టి పెట్టినా ఫలితం ఉం డడం లేదు. అన్ని వాగులపైన గట్టి నిఘా పెడితే ఆ గే అవకాశం ఉంది. జిల్లాలో మాత్రం కొత్త క్వారీలకు అనుమతులు ఇవ్వలేదని మైనింగ్‌ శాఖ అధికారి స త్యనారాయణ తెలిపారు. ప్రభుత్వ అవసరాలకు మా త్రమే ఇసుక తవ్వకాలకు మండలాల పరిధిలో తహసీల్దార్‌లు అనుమతులు ఇస్తున్నారన్నారు. అక్రమ రవాణా జరగకుండా ఆయా శాఖల ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.

Updated Date - 2021-01-13T05:18:52+05:30 IST