పురావస్తు తవ్వకాల్లో ఆశ్చర్యకర పరిణామం.. ఒక్కోటి 40 కిలోల వరకు బరువున్న గుండ్రటి... ఇంతకీ, అవేంటంటే..

ABN , First Publish Date - 2022-02-13T00:42:40+05:30 IST

ఇటీవల పలు ప్రాంతాల్లో వందల ఏళ్ల నాటి కోటలు, వస్తువులు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. మధ్యప్రదేశ్‌లోనూ ఆ కోవలోనే... పురావస్తు శాఖ అధికారుల సర్వేలో ఒకప్పటి అరుదైన శిలాజాలు బయటపడ్డాయి..

పురావస్తు తవ్వకాల్లో ఆశ్చర్యకర పరిణామం.. ఒక్కోటి 40 కిలోల వరకు బరువున్న గుండ్రటి... ఇంతకీ, అవేంటంటే..

చరిత్రలో కలిసిపోయిన ఎన్నో వింతలు, విశేషాలు... అప్పుడప్పుడూ పురావస్తు తవ్వకాల్లో బయటపడుతుండడం చూస్తుంటాం. ఇటీవల పలు ప్రాంతాల్లో వందల ఏళ్ల నాటి కోటలు, వస్తువులు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. మధ్యప్రదేశ్‌లోనూ ఆ కోవలోనే... పురావస్తు శాఖ అధికారుల సర్వేలో ఒకప్పటి అరుదైన శిలాజాలు బయటపడ్డాయి. ఒక్కోటి 40కిలోల వరకు బరువు ఉన్న వాటిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే..


మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ సెంద్వా బ్లాక్‌ పరిధి వర్ల తహసీల్‌లోని అటవీ ప్రాంతంలో పురావస్తుశాఖ అధికారులు జనవరి 30 నుంచి తవ్వకాలు చేపడుతున్నారు. పురావస్తు శాస్త్రవేత్త డాక్టర్ డీపీ పాండే ఆధ్వర్యంలో చేపట్టిన తవ్వకాల్లో అరుదైన శిలాజాలు బయటపడ్డాయి. ఫిబ్రవరి 5న చేపట్టిన తవ్వకాల్లో ఒక్కోటి 40కిలోల బరువున్న పది గుండ్రటి రాళ్లను హింగ్వా గ్రామ అటవీ ప్రాంతంలో గుర్తించారు. వీటిపై పరిశోధనలు చేయగా డైనోసార్ గుడ్లు అని తేలినట్లు పురావస్తు శాస్త్రవేత్త డాక్టర్ డీపీ పాండే తెలిపారు. ఇవి సుమారు 60 లక్షల నుంచి 10 మిలియన్ (కోటి) సంవత్సరాల కిందటివని చెప్పారు. వాటిలో కొన్నింటిని ఇండోర్‌లోని మ్యూజియంలో ఉంచనున్నారు. గుడ్లు బయటపడిన ప్రాంతంలో ఫాసిల్ పార్క్‌ను నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఫారెస్ట్ ఎస్‌డీవో సందీప్ వస్కలే తెలిపారు.

రైలు పట్టాలు దాటుతోన్న 20 ఏళ్ల యువతి.. హఠాత్తుగా కదిలిన గూడ్సు రైలు.. ఓ వ్యక్తి చేసిన రిస్క్ ఇదీ..!

Updated Date - 2022-02-13T00:42:40+05:30 IST