వాకర్స్‌ ఇంటర్నేషనల్‌ డిస్ర్టిక్ట్‌ 302 గవర్నర్‌గా ఆర్కాట్‌

Published: Wed, 19 Jan 2022 01:25:30 ISTfb-iconwhatsapp-icontwitter-icon
వాకర్స్‌ ఇంటర్నేషనల్‌ డిస్ర్టిక్ట్‌ 302 గవర్నర్‌గా ఆర్కాట్‌ కృష్ణప్రసాద్‌

తిరుపతి(కొర్లగుంట), జనవరి 18: వాకర్స్‌ ఇంటర్నేషనల్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల్లో డిస్ట్రిక్ట్‌ 302 గవర్నరుగా తిరుపతికి చెందిన ఆర్కాట్‌ కృష్ణప్రసాద్‌ను నియమించినట్లు ప్రధాన కార్యదర్శి శీలంఐజాక్‌ ఉత్తర్వులు జారీచేశారు. ఈ విషయాన్ని మంగళవారం కృష్ణప్రసాద్‌ తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో మీడియాకు వెల్లడించారు. వాకర్స్‌ ఇంటర్నేషనల్‌ను ప్రపంచ వ్యాప్తంగా మూడు ఏరియాలుగా, 10 జిల్లాలుగా విభజించారన్నారు. అందులో రాయలసీమ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, పుదుచ్చేరి, అండమాన్‌ను ఓ జిల్లాగా ఏర్పాటుచేసి 302 నెంబరు ఖరారు చేశారన్నారు. దీనికి తనను గవర్నర్‌గా ఎన్నుకున్నారని వివరించారు. వాకర్స్‌ పురోగతికి, అభ్యున్నతికి, సమాజసేవకోసం కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. వాకర్స్‌కు ప్రతినెలా వైద్యపరీక్షలు, అవగాహన సదస్సులు నిర్వహిస్తామన్నారు. 2022వాకర్స్‌ ఇంటర్నేషనల్‌ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ దేవరాజులు, పేరూర సుధాకర్‌రెడ్డి, దేవరాజులనాయుడు, వేణుగోపాలరాజు, చంద్రశేఖర్‌రెడ్డి, గోపిప్రసాద్‌, శ్రీరాములు, విజయభాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.