రేషన షెడ్ల బిల్లులు హుళక్కేనా?

ABN , First Publish Date - 2022-05-28T06:25:39+05:30 IST

జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద మల్బరీతోటల రైతులకు రేషన షెడ్ల బిల్లులు పెండింగ్‌లో పడ్డాయి. మండలంలోని బీదానిపల్లిలో ఐదుగురు మల్బరీ రైతులు ఉపాధి హామీ పథకం కింద రేషన షెడ్లకు గత యేడాది దరఖాస్తు చేసుకున్నారు.

రేషన షెడ్ల బిల్లులు హుళక్కేనా?
షెడ్డు నిర్మాణం చేసినా బిల్లులు ఇవ్వలేదంటున్న మల్బరీ రైతులు

 రొద్దం, మే 27: జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద మల్బరీతోటల రైతులకు రేషన షెడ్ల బిల్లులు పెండింగ్‌లో పడ్డాయి. మండలంలోని బీదానిపల్లిలో ఐదుగురు మల్బరీ రైతులు ఉపాధి హామీ పథకం కింద రేషన షెడ్లకు గత యేడాది దరఖాస్తు చేసుకున్నారు. 2/35 సైజుతో షెడ్డు నిర్మాణం పూర్తిచేసి ఏడు నెలలైంది. ఇప్పటికీ బిల్లులు చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కో షెడ్డు నిర్మాణానికి ఆ పథకం కింద రూ.2.90 లక్షలు సబ్సిడీని ప్రభుత్వం అందిస్తుంది. అలాగే మల్బరీ ప్లాంటేషనకు సం వత్సరానికి ఎకరాకు రూ.50వేల చొప్పున, గరిష్టంగా మూడెకరాల వ రకు సహాయం అందిస్తారు. రైతులు శేషగిరి, అశ్విని, నరసింహులు, శ్రీరాములు, వెంకటరమణ షెడ్ల నిర్మాణం చేశారు. బిల్లుల కోసం అ ధికారుల చుట్టూ తిరుగుతున్నారు. షెడ్లకు మంజూరు ఉత్తర్వులు చేయించి బిల్లులు పెట్టడానికి కూడా అధికారులు ప్రయత్నించకపోవడం శోచనీయం. నెలరోజుల క్రితం జరిగిన మండల సర్వసభ్య స మావేశంలో కంబాలపల్లి సర్పంచ మంజునాథ్‌ ఈ విషయమై అధికారులను నిలదీశారు. మార్చి 31 నాటికి షెడ్లు మంజూరు చే యించి బిల్లులు చేస్తామని హామీ ఇచ్చినా ఇంతవరకు నెరవేర్చలే దు. ఒక్కో రైతు షెడ్డు నిర్మాణానికి రూ.12లక్షలు ఖర్చుపెట్టారు. ప్రభుత్వం 90శాతం సబ్సిడీని మల్బరీ రైతులకు అందిస్తున్నామని గొప్పలు చెప్పినా క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు.


అప్పు చేసి షెడ్డు కట్టాం..

  - శేషగిరి, రైతు, బీదానిపల్లి  

ఉపాధి హామీ అధికారులు రేషన షెడ్లను నిర్మించుకోమంటే... అప్పులు చేసి కట్టాం. బి ల్లులు ఇవ్వమంటే అదిగో చేస్తాం, ఇదిగో చే స్తామంటూ కాలయాపన చేస్తున్నారు. ఒక్కో షెడ్డు నిర్మాణానికి రూ.12లక్షల దాకా ఖర్చయింది. రేషన షెడ్లు మంజూరు చేయించలేదు. బిల్లులు ఎప్పుడు ఇస్తారో వారికే తెలియాలి. 


ఒకరిపై ఒకరు చెబుతున్నారు...

-  నరసింహ, రైతు, బీదానిపల్లి 

మల్బరీ మొక్కల బిల్లులు, రేషనషెడ్ల బి ల్లులు ఇవ్వమంటే సిరికల్చర్‌, ఉపాధిహామీ అ ధికారులు ఒకరిపై ఒకరు చెబుతున్నారు. వారి చుట్టూ తిరిగి వేసారిపోయాం. ఉన్నతాధికారులు స్పందించి మల్బరీ రైతులకు  బిల్లు లు చెల్లించేలా చర్యలు తీసుకోవాలి. 

       

నూతన సాఫ్ట్‌వేర్‌తో ఇబ్బందులు..

జగదీశ్వర్‌రెడ్డి, ఏపీఓ 

జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం అమలులో సాంకేతిక మార్పుల కారణంగా బిల్లులు చేయడం ఇబ్బందిగా మారింది. నూతన సాఫ్ట్‌వేర్‌ సరిపోయిన తర్వాత షెడ్లు మంజూరు చేయిం చి, రైతులకు బిల్లులు అందిస్తాం. 


Updated Date - 2022-05-28T06:25:39+05:30 IST