Inequality in India Report: నెలకు రూ.25 వేలు సంపాదిస్తున్నారా?.. అయితే ఈ విషయం తెలుసుకోండి

ABN , First Publish Date - 2022-05-21T01:45:47+05:30 IST

దేశ ఆదాయ పంపిణీలో వైషమ్యాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. జాతీయ ఆదాయంలో 5 - 7 శాతం మొత్తాన్ని కేవలం 1 శాతం మంది ధనికులే సంపాదిస్తున్నారు.

Inequality in India Report: నెలకు రూ.25 వేలు సంపాదిస్తున్నారా?.. అయితే ఈ విషయం తెలుసుకోండి

న్యూఢిల్లీ : దేశ ఆదాయ పంపిణీలో అసమానతలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. జాతీయ ఆదాయంలో 5 - 7 శాతం మొత్తం కేవలం 1 శాతం మంది ధనికుల చేతుల్లోకే పోతోంది. ఇందుకు పూర్తి విరుద్ధంగా దేశంలో ఉపాధి పొందుతున్నవారిలో 15 శాతం మంది నెలకు రూ.5 వేల కంటే తక్కువ (64 డాలర్లు) ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. ఈ మేరకు ఆదాయ అసమానతలను తెలియజేస్తూ ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి(ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్)  ‘భారత్‌లో అసమానతల స్థితి’ పేరిట నివేదికను గురువారం విడుదల చేసింది. సగటున నెలకు రూ.25 వేల సంపాదిస్తున్నవారు దేశంలో అత్యధిక ఆదాయం పొందుతున్న టాప్ 10 శాతం మంది జాబితాలో ఉన్నారని రిపోర్ట్ తేల్చిచెప్పింది. వీరి భాగస్వామ్యం జాతీయాదాయంలో 30 - 35 శాతం వరకు ఉందని వివరించింది. టాప్ 1 శాతం మంది ఆదాయం అమాంతం పెరిగిపోతుండగా... ఇందుకు వ్యతిరేకంగా దిగువ 10 శాతం మంది ఆదాయం అంతకంతకూ క్షీణిస్తోందని స్పష్టం చేసింది. ఆదాయ వ్యత్యాసాల మధ్య అసమానతలను తొలగించాల్సిన అవసరం ఉందని సూచించింది. చర్యలు తీసుకోకుంటే సామాజిక పురోగతి, ఆర్థిక లక్ష్యాలు నెరవేరవని రిపోర్ట్ హెచ్చరించింది.


కుటుంబాల పరిస్థితుల మెరుగుపరచడంలో భారత్ అద్భుతమైన ప్రయత్నాలు చేసింది. కుటుంబాల అవసరాలు, తగిన నీటి సప్లయ్, పారిశుద్ధ్యం విషయాల్లో గణనీయ పురోగతి లభించింది. అయితే జనాల ఆదాయంలో సమానత, పేదరికం నిర్మూలన, ఉపాధి కల్పన కోసం మరిన్ని మెరుగైన చర్యలు తీసుకోవాల్సి ఉందని స్పష్టం చేసింది.

Updated Date - 2022-05-21T01:45:47+05:30 IST