జీవితం మీద బోర్ కొడుతుందా? అయితే ఇది తెలుసుకోండి!

ABN , First Publish Date - 2022-04-16T17:37:58+05:30 IST

రోజు వారి ఒకే పని అలుపెరుగక పని చేస్తూ ఉంటే జీవితం ఇంతేనా అనే భావన కలుగుతుంది. నిరాశ, నిస్పృహలు దరి చేరతాయి. ముఖ్యంగా మహిళలు ఇంటిపనులు,

జీవితం మీద బోర్ కొడుతుందా? అయితే ఇది తెలుసుకోండి!

ఆంధ్రజ్యోతి(16-04-2022)

రోజు వారి ఒకే పని అలుపెరుగక పని చేస్తూ ఉంటే జీవితం ఇంతేనా అనే భావన కలుగుతుంది. నిరాశ, నిస్పృహలు దరి చేరతాయి. ముఖ్యంగా మహిళలు ఇంటిపనులు, ఆఫీసు పనులు చేస్తూ ఒకే మూసలో కొట్టుకుపోతుంటారు. బర్నవుట్‌ అవుతుంటారు. ఇలాంటి వారికి ఓ మార్పు తప్పకుండా అవసరం.


ఏదైనా పని కానప్పుడు, కన్న కలలు నెరవేరనప్పుడు నెగటివ్‌ ఆలోచనలు ఆవరిస్తాయి. మానసికంగా కోపోద్రిక్తులవుతారు. బర్నవుట్‌ అవుతారు. ముఖ్యంగా ఒత్తిడి, అలసట, అసహనం ఇలాంటి ప్రభావానికి గురవుతారు. అందుకే ఇతరులతో కలివిడిగా ఉండటం నేర్చుకుంటే.. కాస్త ఉపశమనం కలుగుతుంది. పనిఒత్తిడి నుంచి విశ్రాంతి తీసుకోవాలి. ఇష్టమైన వ్యక్తులతో మాట్లాడాలి. మీకు గౌరవం ఇవ్వటంతో పాటు మీ పనితనాన్ని, మీ ప్రతిభను నిజాయితీగా ప్రశంసించే స్నేహితులతో గడపండి. ఇదెంతో మేలు చేస్తుంది. కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపాలి. గేమ్స్‌ ఆడటం, ఇంటిల్లిపాది హోటల్‌కు డిన్నర్‌కు వెళ్లటం చేయాలి. దీనివల్ల మానసికంగా మార్పు కనపడుతుంది. పని ప్రదేశాల్లో ఇతరులతో స్నేహం చేయటం మంచిదే. కొత్త నెట్‌వర్క్‌ను పెంచుకోవాలి. ముఖ్యంగా పాజిటివ్‌నెస్‌ ఉండే వ్యక్తులతో ఉంటే.. రిలాక్స్‌గా ఉంటారు.


కోపం, బర్నవుట్‌ కావటానికి కారణం నెగటివ్‌ ఆలోచనలే. అలాంటప్పుడు ఇంకా నెగటివ్‌ ఆలోచనలు ఉండే వారితో సావాసం చేస్తే అంతే సంగతులు. అలాంటి వ్యక్తులకు మరింత దూరంగా ఉండండి. చేస్తున్న పని నచ్చకుంటే.. నిందిస్తూ కూర్చోవటం కంటే ఆనందాన్నిచ్చే పని చేయండి. ముఖ్యంగా ఒకే మూసలో నలిగిపోకుండా మీకు మీరు బ్రేక్‌ ఇచ్చుకోండి. మీ పేరెంట్స్‌ ఇంటికి వెళ్లటం లేదా పర్యాటక ప్రదేశాలకు వెళ్లాలి. ఇలా చేస్తే మీ ఆలోచనల్లో మార్పు వస్తుంది. ఎనర్జిటిక్‌గా ఉంటారు. కార్బొహైడ్రేట్స్‌ తక్కువగా తీసుకోవాలి. విపరీతంగా స్వీట్స్‌, జంక్‌ఫుడ్‌ను తినటం మానేయాలి.


ప్రొటీన్లుండే ఆహారం, తాజా పండ్లు.. లాంటి మంచి ఆహారం తింటే పాజిటివ్‌ ఆలోచనలు కలుగుతాయి. ఓ పని నచ్చకున్నా అలానే చేస్తూ వెళ్లటం చేయద్దు. ‘నో’ చెప్పగలగాలి. ఉదయాన్నే నడక లేదా మెడిటేషన్‌ లేదా వర్కవుట్స్‌ చేయాలి. దీనివల్ల శరీరం రిలాక్స్‌ అవుతుంది. ఫ్రెష్‌గా అనిపిస్తుంది. కష్టాల శాతం ఎక్కువే ఉంటుంది. అట్లాగని వాటినే ఆలోచిస్తూ తిట్టుకోవటం శుద్ధ దండగ. అందుకే వీలైనంత హ్యాపీగా గడపాలి. చిరునవ్వుతో జీవితాన్ని స్వీకరించాలి. ప్రతి పనిని జ్ఞాపకంగా మలచుకోవాలి.

Updated Date - 2022-04-16T17:37:58+05:30 IST