7 Medications That Could Be Making You Gain Weight : ఈ మెడిసిన్స్ వాడుతున్నారా? అవి బరువు పెరిగేలా చేస్తాయి జాగ్రత్త..!

ABN , First Publish Date - 2022-09-01T16:56:21+05:30 IST

కొన్ని అత్యవసరం అయినవి అయితే మరికొన్ని అప్పటికి కాస్త రిలీఫ్ ఇచ్చేవి. కాకపోతే కొన్ని రకాల మందులు వేసుకున్నాకా.. సైడ్ ఎఫెక్ట్స్ బాధిస్తాయి.

7 Medications That Could Be Making You Gain Weight : ఈ మెడిసిన్స్ వాడుతున్నారా? అవి బరువు పెరిగేలా చేస్తాయి జాగ్రత్త..!

ఉదయం లేచింది మొదలు మామూలుగా మనం చాలా రకాల మందులు వేసుకుంటూ ఉంటాం. కొన్ని అత్యవసరం అయినవి అయితే మరికొన్ని అప్పటికి కాస్త రిలీఫ్ ఇచ్చేవి. కాకపోతే కొన్ని రకాల మందులు వేసుకున్నాకా.. సైడ్ ఎఫెక్ట్స్ బాధిస్తాయి. మనం వాడే కొన్ని మెడిసిన్స్ డాక్టర్స్ సిఫార్స్ చేసినా వాటివల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ బారిన పడుతుంటాం. 


కొన్ని మెడిసిన్స్  వేసుకున్నాకా కొందరిలో చికాకు, గుండెదడ, తలతిప్పడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వాటితో పాటు బరువు పెరగడం కూడా ఇందులో భాగం. కొన్ని మందులు వాడటం వల్ల మనకు తెలీకుండానే బరువు పెరుగుతాం. మనలో చాలా మందికి బరువు అనేది చాలా సున్నితమైన అంశం. పెరిగిన బరువు తగ్గాలని ప్రయత్నించినప్పటికీ అంత త్వరగా తగ్గడం అనేది సాధ్యం కాదు. ది అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ అధ్యయనం ప్రకారం లింగాన్ని బట్టి శరీర కొవ్వు 8 నుంచి 35 శాతం వరకూ వ్యత్వాసం ఉంటుందట. అసలు బరువు పెంచే మెడిసిన్స్ ఏంటంటే..


1. SSRIs

సెలక్టివ్ సెరోటోనిన్ రీఅప్టేక్ ఇన్హిబిటర్స్, లేదా SSRI ఎస్కిటోప్రామ్, పారోక్సేటైన్, ప్లూక్సేటైన్, సైర్ట్రాలైన్ హైడ్రోక్లోరైడ్ వంటి మందులు యాంటిచిప్రెసెంట్ లను కలిగిస్తాయి. ఓరకంగా చెప్పాలంటే ఇవి చాలామంది రోగుల జీవితాలను మార్చే మందులు. అయితే ఇవి రోగి ఆకలిని, వ్యాయామ అలవాట్లనూ ప్రభావితం చేస్తాయి. 


2. Beta-blockers

బీటా బ్లాకర్స్ తీసుకునే వ్యక్తుల్లో అధిక రక్తపోటు, గుండె దడ, అలాగే మైగ్రేన్ సమస్య ఉంటుంది. వీళ్ళు వారానికి నాలుగు కేజీల వరకూ పెరుగుతారు. 


3. ఇన్సులిన్ (Insulin)

టైప్ 1 డయాబెటీస్ తో బాధపడుతున్నవారు ఇన్సులిన్ తీసుకోవడం అనేది సాధారణమైన విషయమే.. అయితే స్వీట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల వీరిలో కొవ్వు శరీరంలో పేరుకుంటుంది. 


4. కార్టికోస్టెరాయిడ్స్ (Corticosteroids)

కార్టికోస్టెరాయిడ్స్ ను తీసుకుంటే ప్రెడ్నిసోన్, కార్టిసోన్ లను కలిగిన మెడిసిన్స్ తీసుకుంటే బరువుపెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ మందులు మానేసిన ఆరునెలల్లో మళ్ళీ బరువు తగ్గే అవకాశం ఉంటుంది.


5. మూర్ఛ మందులు (Anti-seizure medications)

ఎపిలెప్సీ మూర్చరోగం ఉన్నవారు రోజువారీ తీసుకునే గబాపెంటిన్ , విగాబాట్రిన్ వంటి మందులను తీసుకుంటే ఆకలి పెరుగుతుంది. ఈ రోగి బరువు పెరుగుతున్నట్లయితే డాక్టర్ సలహాతో ఎపిలెప్టిక్ మెడిసిన్ తీసుకోవడం వల్ల బరువుతగ్గచ్చు. 


6. యాంటిసైకోటిక్స్ (Antipsychotics) 

సాధారణంగా స్కిజోఫ్రెనియా, బైపోలార్ డిజార్టర్ చికిత్సకు ఉపయోగిస్తారు. యాంటిసైకోటిక్ మందులు బరువు పెరగేలా చేస్తాయి. అయితే జిప్రాసిడోన్ యాంటీసైకోటిక్స్ బరువు పెరిగే అవకాశాన్ని తగ్గిస్తుంది. 


7. OTC అలెర్జీ మందులు (OTC allergy medications)

ఇవి కేవలం ప్రిస్క్రిప్షన్ మెడిసిన్స్ మాత్రమే కాదు. ఫెక్సోఫెనాడిన్, సైటిరిజైన్ పిల్లల్లో బరువు పెరిగేలా చేస్తాయి. ఆకలి పెరిగి బద్దకంగా మారతారు. పిల్లల జీవక్రియలో మార్పులు కలిగి బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.  


ఇలా మందులతో బరువు పెరిగినవారు ఇష్టమైన ఫుడ్, బట్టల విషయంలో ఇబ్బంది పడుతుంటారు. బరువును పెంచే మెడిసిన్స్ తీసుకుంటున్నప్పుడు వ్యాయామం చేయడం దీనికి ప్రత్యామ్నాయం. 

Updated Date - 2022-09-01T16:56:21+05:30 IST