బాలికను వేధించిన వ్యక్తి అరెస్టు

ABN , First Publish Date - 2021-06-18T05:49:21+05:30 IST

వేధింపులు తట్టుకోలేక ఓ బాలిక ఆత్మహత్యకు యత్నించిన కేసులో నిందితుడైన తాడేపల్లి ఎన్టీఆర్‌ కట్ట ప్రాంతానికి చెందిన మహేంద్ర అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు సీఐ శేషగిరిరావు తెలిపారు.

బాలికను వేధించిన వ్యక్తి అరెస్టు
అరెస్టు వివరాలు వెల్లడిస్తున్న సీఐ శేషగిరిరావు

తాడేపల్లి టౌన్‌, జూన్‌17: వేధింపులు తట్టుకోలేక ఓ బాలిక ఆత్మహత్యకు యత్నించిన కేసులో నిందితుడైన తాడేపల్లి ఎన్టీఆర్‌ కట్ట ప్రాంతానికి చెందిన మహేంద్ర అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు సీఐ శేషగిరిరావు తెలిపారు. బాలిక ఈ నెల 4న పాలు కొనుగోలుకు వెళ్తుండగా మహేంద్ర అసభ్యంగా ప్రవర్తించాడు. నిత్యం ఇలాగే వేధిస్తుండడంతో మనస్తాపం చెందిన బాలిక ఆత్మహత్యాయత్నం చేసింది. కుటుంబ సభ్యులు బాలికను విజయవాడలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కాగా ప్రస్తుతం బాలిక పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.  మహేంద్రను అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచి రిమాండ్‌కు తరలిస్తున్నట్టు తెలిపారు. సమావేశంలో ఎస్‌ఐలు వినోద్‌, నారాయణ, తరంగిణి పాల్గొన్నారు. 


Updated Date - 2021-06-18T05:49:21+05:30 IST