గంజాయి విక్రేతల అరెస్టు

ABN , First Publish Date - 2022-08-14T05:18:26+05:30 IST

వేర్వేరు గంజాయి కేసుల్లో 8 మంది నిందితులను అరెస్ట్‌ చేసి వారి నుంచి 8.5 కేజీల గంజాయి స్వాధీనపరుచుకున్నట్లు నార్త్‌జోన్‌ డీఎస్పీ జె.రాంబాబు తెలిపారు.

గంజాయి విక్రేతల అరెస్టు
నిందితుల వివరాలు ప్రకటిస్తున్న నార్త్‌జోన్‌ డీఎస్పీ రాంబాబు, పెదకాకాని సీఐ సురేష్‌బాబు

8.5 కేజీల గంజాయి, కారు స్వాధీనం

పెదకాకాని, ఆగస్టు 13: వేర్వేరు గంజాయి కేసుల్లో 8 మంది నిందితులను అరెస్ట్‌ చేసి వారి నుంచి 8.5 కేజీల గంజాయి స్వాధీనపరుచుకున్నట్లు నార్త్‌జోన్‌ డీఎస్పీ జె.రాంబాబు తెలిపారు. శనివారం పెదకాకాని పోలీస్‌స్టేషన్‌లో విలేకరులతో మాట్లాడుతూ ఒక కేసులో నెల్లూరు జిల్లా కందుకూరుకు చెందిన కత్తుల కిషోర్‌, కొండాపురానికి చెందిన శామ్యూల్‌ అహ్మద్‌, షేక్‌ అబ్దుల్‌ రహమాన్‌, కావలికి చెందిన కాశీ దానియేల్‌ను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. వీరు తూర్పుగోదావరి జిల్లా సీలేరులోని ఏజన్సీ ప్రాంతంలో గంజాయి కొనుగోలు చేసి కందుకూరు, నెల్లూరు, కావలి ప్రాంతాల్లో విక్రయిస్తుంటారని తెలిపారు. హైవేపై తక్కెళ్ళపాడు సమీపంలో వీరిని అదుపులోకి తీసుకుని 7.5 కేజీల గంజాయి, ఒక ద్విచక్రవాహనం, నాలుగు సెల్‌ఫోన్‌లను స్వాధీనపర్చుకున్నారు. మరో కేసులో పెదకాకానిలోని ఎన్టీఆర్‌ కాలనీకి చెందిన పప్పుల శ్రీకాంత్‌, గుంటూరుకు చెందిన కర్నాటి వెంకటేష్‌, ముత్యాల రాకేష్‌, బత్తుల ప్రసాద్‌ ను అరెస్టు చేశామని, వీరి నుంచి కేజి గంజాయి, కారు స్వాధీనపరుచుకున్నట్లు తెలిపారు. ఈ రెండు కేసుల్లో 8 మంది నిందితులను కోర్టుకు హాజరుపరిచినట్లు పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో పెదకాకాని సీఐ బండారు సురేష్‌బాబు, సిబ్బంది పాల్గొన్నారు. 

   

Updated Date - 2022-08-14T05:18:26+05:30 IST