ఆరేళ్లకే కంప్యూటర్‌ ప్రోగ్రామర్‌!

ABN , First Publish Date - 2020-11-12T05:30:00+05:30 IST

రెండో తరగతి చదివే పిల్లలు కంప్యూటర్‌లో కార్టూన్‌ బొమ్మలు చూస్తూ గడుపుతారు. కానీ అహ్మదాబాద్‌కు చెందిన ఆర్హమ్‌ తలసానియా మాత్రం ఏకంగా అతిపిన్న వయస్కుడైన కంప్యూటర్‌ ప్రొగామర్‌గా...

ఆరేళ్లకే కంప్యూటర్‌ ప్రోగ్రామర్‌!

రెండో తరగతి చదివే పిల్లలు కంప్యూటర్‌లో కార్టూన్‌ బొమ్మలు చూస్తూ గడుపుతారు. కానీ అహ్మదాబాద్‌కు చెందిన ఆర్హమ్‌ తలసానియా మాత్రం ఏకంగా  అతిపిన్న వయస్కుడైన కంప్యూటర్‌ ప్రొగామర్‌గా గిన్ని్‌సబుక్‌ రికార్డుల్లోకి ఎక్కాడు. ఆరేళ్లకే అద్భుతాలు చేస్తున్న ఈ బుడతడి విశేషాలివి...


  1. అర్హమ్‌ వాళ్ల నాన్న ఓమ్‌ తలసానియా సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. ఆయన అర్హమ్‌ ఆసక్తిని గమనించి కోడింగ్‌, కంప్యూటర్‌ ప్రోగ్రామ్‌ బేసిక్స్‌ నేర్పించారు. అప్పటి నుంచి అర్హమ్‌కు కంప్యూటర్లు ప్రపంచం అయ్యాయి. 
  2. మైక్రోసాఫ్ట్‌ సంస్థ నిర్వహించిన పైతాన్‌ ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌ పరీక్షలో పాసవడంతో ప్రపంచంలోనే అతిచిన్న వయసులోనే కంప్యూటర్‌ ప్రోగ్రామర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడీ బాల మేధావి. 
  3. ‘‘మానాన్న నాకు కోడింగ్‌ నేర్పించారు. నాకు రెండేళ్ల వయసు నుంచే నేను ల్యాప్‌ట్యాప్‌, కంప్యూటర్‌, ట్యాబ్స్‌ను ఉయోగించేవాడిని. మానాన్న పైతాన్‌ ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌ మీద పనిచేస్తున్నారని తెలుసుకున్నా. నాకు ఆ లాంగ్వేజ్‌ నేర్చుకోవాలనే ఆసక్తి పెరిగింది’’ అని వివరిస్తాడు అర్హమ్‌.
  4. పెద్దయ్యాక అంకుర వ్యాపారవేత్త అయి, కొత్త యాప్స్‌, గేమ్స్‌, కోడింగ్‌ సిస్టమ్‌ రూపొందిచాలన్నది అర్హమ్‌ లక్ష్యం. పజిల్స్‌ చేయడం, వీడియో గేమ్స్‌ ఆడడం అంటే అర్హమ్‌ ఎంతో ఇష్టం.

Updated Date - 2020-11-12T05:30:00+05:30 IST