ప్రియురాలి ఇంటికి దగ్గరగా.. అర్జున్ కపూర్ ఖరీదైన విల్లా

May 30 2021 @ 20:08PM

బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ ఓ విలాసవంతమైన విల్లాను కొనుగోలు చేసినట్లుగా బాలీవుడ్ మీడియాలో కథనాలు వినవస్తున్నాయి. ప్రస్తుతం ఆయన కొన్న విల్లా.. ముంబైలోని బాంద్రా అంటే తన ప్రియురాలు మలైకా అరోరా ఇంటికి సమీపంలో ఉంటుందని, అందుకే ఖరీదైనా కూడా అర్జున్ కపూర్ వెనకాడకుండా ఆ స్కై విల్లాను కొన్నట్లుగా బాలీవుడ్ మీడియా కథనాలు ప్రచురిస్తోంది. రూ. 20 కోట్లతో కొన్న ఈ స్కై విల్లా నందు ఒక హాలు, వంటగది, నాలుగు బెడ్‌రూమ్లతో పాటు ఒక విశాలమైన బాల్కనీ కూడా ఉందట. ఇటీవల అమితాబచ్చన్ కూడా ఓ ఖరీదైన బంగ్లాను కొనుగోలు చేసినట్లుగా వార్తలు వచ్చాయి. అలాగే హీరోయిన్ సోనాక్షి సిన్హా కూడా ఇటీవల ఓ స్కై విల్లాను కొన్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.