Arjun Kapoor: బాయ్‌కాట్ ట్రెండ్.. చిత్ర పరిశ్రమ తప్పుచేసింది..

Published: Wed, 17 Aug 2022 17:25:56 ISTfb-iconwhatsapp-icontwitter-icon
Arjun Kapoor: బాయ్‌కాట్ ట్రెండ్.. చిత్ర పరిశ్రమ తప్పుచేసింది..

పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసి హీరోగా మారిన వ్యక్తి అర్జున్ కపూర్ (Arjun Kapoor). ‘ఇషాక్ జాదే’ (Ishaqzaade)తో బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చాడు. ‘టు స్టేట్స్’, ‘గుండే’ లతో ప్రేక్షకులకు చేరువయ్యాడు. తాజాగా అతడు మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆసక్తికర కబుర్లను అభిమానులతో పంచుకున్నాడు. బాయ్‌కాట్ ట్రెండ్‌పై స్పందించాడు.


ఆమిర్ ఖాన్ నటించిన ‘లాల్ సింగ్ చడ్డా’ (Laal Singh Chaddha), అక్షయ్ కుమార్ ‘రక్షాబంధన్’ (Raksha Bandhan) లను బాయ్‌కాట్ చేయాలని నెటిజన్స్ గత కొంత కాలంగా పోస్ట్‌లు పెడుతున్న సంగతి తెలిసిందే. ఈ బాయ్‌కాట్ ట్రెండ్‌పై అర్జున్ తన అభిప్రాయలను వ్యక్తం చేశాడు. సినిమా ఇండస్ట్రీ మౌనంగా ఉండి తప్పు చేసిందని తెలిపాడు. ‘‘చిత్ర పరిశ్రమ మౌనాన్ని అందరు చేతకాని తనంగా భావిస్తున్నారు. ప్రతిసారి మనం స్పందించాల్సిన అవసరం లేదు. కానీ, మనం ఎంతగానో భరించాం. ప్రజలు దానిని అలవాటుగా మార్చుకుని బాయ్‌కాట్ చేయడం మొదలుపెట్టారు. అందరు ఏకతాటిపైకి రావాలి. కలసికట్టుగా ఏదో ఒకటి చేయాలి. సోషల్ మీడియాలో పెట్టే పోస్ట్‌లు, హ్యాష్ ట్యాగ్‌లు, ట్రెండ్‌లు నిజాలకు చాలా దూరంగా ఉన్నాయి. బాయ్‌కాట్ సంస్కృతి అంసంబద్ధమైనది. శుక్రవారం విడుదలయ్యే సినిమాల కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురు చూసేవారు. ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. ఘోరంగా తయారయ్యాయి. గత కొన్నేళ్లుగా ప్రజలు మన మీద బురద చల్లుతున్నారు. ఇలాంటి ట్రెండ్‌లు, పోస్ట్‌లు పెట్టేవారిపై గట్టి చర్యలు తీసుకోవాలి’’ అని అర్జున్ కపూర్ చెప్పాడు. గతంలో ఆమిర్ ఖాన్, కరీనా కపూర్ చేసిన వ్యాఖ్యలు ‘లాల్ సింగ్ చడ్డా’ బాయ్‌కాట్‌కు కారణంగా నిలిచాయి. గతంలో ఆమిర్..  ‘‘భారత్‌లో అసహనం పెరిగిపోయింది. కొంత మంది చెడును వ్యాప్తి చేస్తున్నారు. నా భార్య కిరణ్ రావ్ ఈ దేశాన్ని విడిచి వెళ్దామని అడిగింది’’ అని వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో కరీనా కపూర్ గతంలో ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. నెపోటిజంపై అభిప్రాయం అడగగా..‘‘సినిమాలను వీక్షించమని మిమ్మల్ని ఎవరు బలవంతం చేయడం లేదు కదా’’ అని కరీనా స్పందించింది. దీంతో కొంత మంది నెటిజన్స్ ‘లాల్ సింగ్ చడ్డా’ను బాయ్‌కాట్ చేయాలని పోస్ట్‌లు పెట్టారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest News in Teluguమరిన్ని...