Vaccine lottery: అమెరికన్‌ను రాత్రికి రాత్రే కరోడ్‌పతిని చేసింది!

ABN , First Publish Date - 2021-07-23T19:38:51+05:30 IST

వ్యాక్సినేషన్ ప్రక్రియకు ఊతమిచ్చేందుకు అమెరికాలోని పలు రాష్ట్రాలు తాయిలాలు ప్రకటించిన విషయం తెలిసిందే.

Vaccine lottery: అమెరికన్‌ను రాత్రికి రాత్రే కరోడ్‌పతిని చేసింది!

ఆర్లింగ్టన్,అర్కాన్సాస్: వ్యాక్సినేషన్ ప్రక్రియకు ఊతమిచ్చేందుకు అమెరికాలోని పలు రాష్ట్రాలు తాయిలాలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇలాగే అర్కాన్సాస్ రాష్ట్రం ప్రభుత్వం కూడా టీకా తీసుకునే వారి కోసం అర్కాన్సాస్ స్కాలర్‌షిప్ లాటరీ పేరిట విలువైన గిఫ్ట్ వోచర్లు, 1 మిలియన్ డాలర్ల నగదు బహుమతిని ప్రకటించింది. ఇలా వ్యాక్సిన్ వేసుకున్నందుకు ఇచ్చిన ఓ ఉచిత లాటరీ టికెట్‌తోనే అర్కాన్సాస్‌లోని ఆర్లింగ్టన్‌కు చెందిన గేరీ స్మిత్ జాక్‌పాట్ కొట్టాడు. ఈ లాటరీ టికెట్ ద్వారా ఏకంగా 1 మిలియన్ డాలర్లు(రూ. 7.44కోట్లు) గెలుచుకున్నాడు.


ఇటీవల ఫ్యామిలీతో కలిసి రెండు డోసుల కోవిడ్-19 టీకా తీసుకున్నందుకు గేరీకి అర్కాన్సాస్‌ ఫిష్ అండ్ గేమ్ కమిషన్ 1 మిలియన్ డాలర్ల లాటరీ టికెట్ లేదా 20 డాలర్ల గిఫ్ట్ వోచర్‌లలో ఏదో ఒకటి ఎంచుకోవాలని కోరింది. దీంతో అతడు లాటరీ టికెట్ ఎంచుకున్నాడు. అలా ఎంచుకున్న లాటరీ టికెట్‌ గేరీకి అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. ఒకటికాదు రెండుకాదు ఏకంగా 1 మిలియన్ డాలర్లు గెలుచుకున్నాడు. దీంతో గేరీ ఆనందానికి అవధుల్లేవు. కాగా, 2009 నుండి అర్కాన్సాస్‌లో 1 మిలియన్ లేదా అంతకంటే ఎక్కువ విలువైన లాటరీ బహుమతిని గెలుచుకున్న 83వ వ్యక్తి గేరీ స్మిత్.

Updated Date - 2021-07-23T19:38:51+05:30 IST