Armed Forcesకు కోవిడ్-19 నుంచి సంపూర్ణ రక్షణ కవచం!

ABN , First Publish Date - 2021-05-01T23:04:18+05:30 IST

భారత దేశంలోని సాయుధ దళాలకు కోవిడ్-19 నుంచి సంపూర్ణ

Armed Forcesకు కోవిడ్-19 నుంచి సంపూర్ణ రక్షణ కవచం!

న్యూఢిల్లీ : భారత దేశంలోని సాయుధ దళాలకు కోవిడ్-19 నుంచి సంపూర్ణ రక్షణ త్వరలో లభించబోతోంది. కోవిడ్-19 నుంచి కాపాడుకునేందుకు నూటికి నూరు శాతం వ్యాక్సినేషన్ జరగబోతోంది. మే 1 నుంచి 18 ఏళ్ళ వయసు పైబడినవారందరికీ వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రభుత్వం అనుమతించడంతో ఇది సాధ్యం కాబోతోంది. ఈ వివరాలను డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ (మెడికల్) లెఫ్టినెంట్ జనరల్ మాధురి కనిట్కర్ శనివారం తెలిపారు. 


వ్యాక్సినేషన్ ప్రక్రియకు ప్రాధాన్యతా రంగాల్లో సాయుధ దళాలను కూడా చేర్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఈ వ్యాక్సినేషన్ సాయుధ దళాలకు కవచం వంటిదని తెలిపారు. కోవిడ్-19 నిరోధక వ్యాక్సినేషన్ నూటికి నూరు శాతం జరగాలన్నలక్ష్యాన్ని సాయుధ దళాలు త్వరలో పూర్తి చేయబోతున్నట్లు తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సాయుద దళాలకు ప్రాధాన్యత కల్పించారని, అందుకు తాము ధన్యవాదాలు చెప్తున్నామని అన్నారు. ఈ వ్యాక్సిన్ సురక్షితమైనదని, తామంతా దీనిని తీసుకున్నామని తెలిపారు. తాము అస్వస్థులం కాలేదు కాబట్టి ఇది సురక్షితమైనదేనని స్పష్టమవుతోందన్నారు. ఇదే అల్టిమేట్ మెసేజ్ అన్నారు. ఇప్పుడు దీనిని అన్ని వయసులవారికీ ఇస్తున్నారన్నారు. 


భారతీయ వాయు సేన, నావికా దళాల్లో దాదాపు 95 శాతం మంది మొదటి డోసును తీసుకున్నారని చెప్పారు. సైన్యంలో దాదాపు అందరూ టీకా మొదటి మోతాదును తీసుకున్నారని, అత్యధికులు రెండో డోసు కూడా తీసుకున్నారని తెలిపారు. సాయుధ దళాల్లో చాలా తక్కువ మంది మాత్రమే కోవిడ్-19 బారినపడ్డారని తెలిపారు. ఇది సోకినవారిలో కూడా చాలా తక్కువ లక్షణాలే కనిపించాయన్నారు. 


Updated Date - 2021-05-01T23:04:18+05:30 IST