పంట నష్టంపై పకడ్బందీగా సర్వే చేపట్టాలి

Jul 27 2021 @ 23:06PM
మాట్లాడుతున్న తహసీల్దార్‌, ఏఓ

వాంకిడి, జూలై 27: భారీ వర్షాలకు నష్టపోయిన పంటలను పకడ్బందిగా సర్వే చేపట్టాలని తహసీల్దార్‌ మధుకర్‌, వ్యవసాయ అధికారి మిలింద్‌ సూచించారు. మంగళవారం తహసీల్‌ కార్యాలయంలో పంట సర్వేపై వ్యవసాయ, రెవెన్యూ సిబ్బందితో సమావేశాన్ని నిర్వహించారు. భారీ వర్షాలకు వదరల వల్ల జరిగిన పంట నష్టం వివరాలను జాగ్రత్తగా నమోదు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఏఈఓ, రెవెన్యూ సిబ్బది పాల్గొన్నారు. 

జైనూరు: వర్షాలతో నష్టపోయిన పంటలపై సత్వరమే సర్వే నిర్వహించాలని తహసీల్దార్‌ సాయన్న సూచించారు. తహసీ ల్దార్‌ కార్యాలయంలో మంగళవారం వీఅర్‌ఎ, ఎఈవోలకు ఏర్పాటు చేసిన సమావేశంలో తహసల్దార్‌ సాయన్న, మండల వ్యవసాయ అధికారి జాదవ్‌ పవన్‌కుమార్‌లు మాట్లాడారు.   అడ్డెసర్‌, చింతకర్ర, పానాపటార్‌, గూడామామడ, గౌరి, లేండిగూడ, కిషన్‌ నాయక్‌తండా, మార్లావాయి, వనూర్‌, జైనూరు, పొచంలొద్ది, ఉషేగాం తదితర గ్రామాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు సమాచారం అందిందన్నారు. 

Follow Us on: