పకడ్బందీ చర్యలు చేపట్టాలి : కలెక్టర్‌

ABN , First Publish Date - 2021-01-22T05:14:02+05:30 IST

పల్లె ప్రగతి కార్యక్రమాల అమలుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ ఆదేశించారు. గురువా రం జిల్లాకేంద్రంలోని ఆర్‌కే కన్వెన్షన్‌ హాలులో పల్లెప్రగతి కార్యక్రమాల అమ లు, సాధించిన పురోగతిపై ప్రజాప్రతినిధులు, అధికారులతో నిర్వహించిన స మావేశంలో ఆయన మాట్లాడారు.

పకడ్బందీ చర్యలు చేపట్టాలి : కలెక్టర్‌
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ

నిర్మల్‌ టౌన్‌, జనవరి 21 : పల్లె ప్రగతి కార్యక్రమాల అమలుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ ఆదేశించారు. గురువా రం జిల్లాకేంద్రంలోని ఆర్‌కే కన్వెన్షన్‌ హాలులో పల్లెప్రగతి కార్యక్రమాల అమ లు, సాధించిన పురోగతిపై ప్రజాప్రతినిధులు, అధికారులతో నిర్వహించిన స మావేశంలో ఆయన మాట్లాడారు. డంపింగ్‌ యార్డులు, పల్లెప్రకృతి వనాలు, శ్మశాన వాటికల నిర్మాణాలతో రాష్ట్రంలోనే నిర్మల్‌ జిల్లా ముందు వరుసలో ని లిచిందన్నారు. ఇప్పటివరకు పల్లె ప్రగతిలో వివిధ నిర్మాణాలను చేపట్టినట్లు చెప్పారు. ఇక నుంచి వాటిని వినియోగంలోకి తీసుకురావాలన్నారు. ప్రతీ గ్రా మంలో తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరణ చేయాలని సూచించారు. సమా వేశంలో అదనపు కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే, జడ్పీ సీఈవో సుధీర్‌, డీఆర్డీవో వెంకటేశ్వర్లు, డీపీవో వెంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు. 

పాఠశాలలను పర్యవేక్షించండి

జిల్లాలోని ప్రతీ పాఠశాల శుభ్రంగా ఉండేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ ఆదేశించారు. గురువారం కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో పాఠశాలల ప్రారంభం, తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత శాఖల అధికారు లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. లాక్‌డౌన్‌ అనంతరం ప్రభుత్వ ఆదేశాలతో ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లాలోని ప్రతి పాఠశాల, సంక్షేమ శాఖల వసతి గృహా లు, కళాశాలలు శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతీ పాఠశాలలో పరిసరాల శుభ్రతతో పాటు విద్యుత్‌, తాగునీరు. మరుగుదొడ్లు, ఫ్యాన్లు ఏర్పాటు చేయాలన్నారు. గణతంత్ర వేడుకలకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వేడుకలను ఎలా నిర్వహించుకోవాలో అన్నదనిపై ప్రభుత్వం నుంచి గైడ్‌లైన్స్‌ రాలేదన్నారు. ప్రస్తుతానికి అన్ని ఏర్పా ట్లు సిద్ధం చేసుకొని ఉండాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే, వోఎస్‌డి. రాజేష్‌, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-22T05:14:02+05:30 IST