నేరస్థులకు శిక్ష పడేలా పకడ్బందీ చర్యలు

ABN , First Publish Date - 2021-03-07T06:05:11+05:30 IST

నేరస్థులకు శిక్ష పడేలా కోర్టు డ్యూటీ అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ వీబీ కమలాసన్‌రెడ్డి అన్నారు.

నేరస్థులకు శిక్ష పడేలా పకడ్బందీ చర్యలు
మాట్లాడుతున్న సీపీ కమలాసన్‌రెడ్డి

-పోలీస్‌ కమిషనర్‌ వీబీ కమలాసన్‌రెడ్డి

కరీంనగర్‌ క్రైం, మార్చి6: నేరస్థులకు శిక్ష పడేలా కోర్టు డ్యూటీ అధికారులు  పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ వీబీ కమలాసన్‌రెడ్డి అన్నారు. శనివారం కమిషనరేట్‌ కేంద్రంలో కోర్టు డ్యూటీ అధికారుల (సీడీఓ) శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా కమిష నర్‌ మాట్లాడుతూ ప్రతి కేసులోని దశలను సంబంధిత అధికారులకు ఎప్పటి కప్పుడు తెలియజేయాలని ఆదేశించారు. టెక్నాలజీ వినియోగంతో ఏయే విభాగాలు ఎలా పనిచేస్తున్నాయో తెలుసు కునే అవకాశం ఏర్పడిందన్నారు. సీడీఓలు కేసులు ఏయే దశల్లో ఉన్నాయో ప్రతి రోజు అప్‌లోడ్‌ చేయాలని సూచించారు. ఏ నేర సంఘటననైనా ఒక ఛాలెంజ్‌గా తీసుకుని ప్రణాళికబద్ధంగా ముందుకు సాగితే ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గుర్తించాలన్నారు. నేరస్థులు శిక్షింపబడితేనే  ప్రజల్లో పోలీసుల పట్ల నమ్మకం పెరుగుతుందని పేర్కొన్నారు. నేరస్థులకు శిక్షిపడేలా పనిచేసే సీడీ వోలకు ప్రోత్సాహకాలు అందిస్తామని సీపీ ప్రకటిం చారు. ఈ మధ్య కాలంలో ఆశించిన స్థాయిలో ఫలితాలను రాబట్టలేక పోయారని ఆయన అసం తృప్తి వ్యక్తం చేశారు. 

కేసులకు సంబంధించిన వివరాలను ఎప్పటి కప్పుడు అప్‌లోడ్‌ చేయాలని సీపీ సూచించారు. లేకపోతే పనిలో వెనుకబడిపోయామనే విష యాన్ని గణాంకాలు వెల్లడిస్తాయన్నారు. పోలీసు శాఖలోని అన్ని విభాగాల్లో నైపుణ్యాన్ని పెంపొం దించేందుకు చర్యలు తీసుకుంటామని సీపీ పేర్కొన్నారు. ఈ సమావేశంలో సీఐలు శ్రీదర్‌, నటేష్‌, పలువురు అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-07T06:05:11+05:30 IST