Jammu Kashmir: పుల్వామాలో తుపాకులు స్వాధీనం

ABN , First Publish Date - 2021-09-17T18:34:37+05:30 IST

జమ్మూకశ్మీరులోని పుల్వామా జిల్లాలో స్థానిక పోలీసులు, సైనికులతో కలిసి జరిపిన గాలింపులో ఉగ్రవాదులుంచిన డంప్ నుంచి తుపాకులు, తూటాలను స్వాధీనం చేసుకున్నారు....

Jammu Kashmir: పుల్వామాలో తుపాకులు స్వాధీనం

పుల్వామా: జమ్మూకశ్మీరులోని పుల్వామా జిల్లాలో స్థానిక పోలీసులు, సైనికులతో కలిసి జరిపిన గాలింపులో ఉగ్రవాదులుంచిన డంప్ నుంచి తుపాకులు, తూటాలను స్వాధీనం చేసుకున్నారు. పుల్వామా జిల్లాలోని తెలంగాం గ్రామంలో ఉగ్రవాదులు దాచి ఉంచిన 4 పిస్టళ్లు, తూటాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రెండు రోజుల క్రితం పుల్వామాలోని మెయిన్ చౌక్ వద్ద పోలీసు పార్టీపై గుర్తుతెలియని ఉగ్రవాదులు గ్రెనెడ్లను విసిరారు. ఈ ఘటనలో ముగ్గురు పౌరులు గాయపడ్డారు. అనంతరం పోలీసులు, సైనికులతో కలిసి గాలింపు చేపట్టగా ఉగ్రవాదులు దాచిన తుపాకులు దొరికాయి. పోలీసులు తుపాకులను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-09-17T18:34:37+05:30 IST