మంచు కురుస్తున్నా బాలింతను ఇంటికి చేర్చిన సైనికులు

ABN , First Publish Date - 2021-01-24T12:03:27+05:30 IST

మంచు కురుస్తుండటంతో నవజాత శిశువుతో ఆసుపత్రిలో ఇరుక్కున్న బాలింతను భారత సైనికులు 6 కిలోమీటర్ల దూరం స్ట్రెచరుపై తీసుకువెళ్లి ఇంటికి చేర్చిన ఘటన...

మంచు కురుస్తున్నా బాలింతను ఇంటికి చేర్చిన సైనికులు

కుప్వారా : మంచు కురుస్తుండటంతో నవజాత శిశువుతో ఆసుపత్రిలో ఇరుక్కున్న బాలింతను భారత సైనికులు 6 కిలోమీటర్ల దూరం స్ట్రెచరుపై తీసుకువెళ్లి ఇంటికి చేర్చిన ఘటన జమ్మూకశ్మీరులోని కుప్వారాలో జరిగింది. జమ్మూకశ్మీరులో జనవరి 3వతేదీ నుంచి భారీగా మంచు కురుస్తుండటంతో రోడ్లపై మంచు 10 అంగుళాల మేర పేరుకుపోయింది. దీంతో రోడ్లపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.భారీ హిమపాతం మధ్య ఓ గర్భిణీ ఆసుపత్రిలో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారు. మంచు విస్తారంగా కురుస్తుండటంతో బాలింత, నవజాత శిశువును ఆసుపత్రి నుంచి ఇంటికి వాహనంలో తరలించ లేకపోయారు. మంచు కురుస్తున్నా ఆసుపత్రిలోనే ఇరుక్కున్న బాలింతను సైనికులు స్ట్రెచరు మీద తీసుకొని 6 కిలోమీటర్ల దూరం మోసి ఇంటికి చేర్చారు. మంచుతుపానులోనూ తమకు సాయం అందించిన సైనిక సిబ్బందికి బాలింత కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - 2021-01-24T12:03:27+05:30 IST