రాజౌరీ ఎన్‌‌కౌంటర్లో అమరుడైన ఆర్మీ జేసీఓ

ABN , First Publish Date - 2021-08-19T19:56:35+05:30 IST

జమ్మూ-కశ్మీరులోని రాజౌరీ జిల్లాలో గురువారం ఉగ్రవాదులతో

రాజౌరీ ఎన్‌‌కౌంటర్లో అమరుడైన ఆర్మీ జేసీఓ

జమ్మూ : జమ్మూ-కశ్మీరులోని రాజౌరీ జిల్లాలో గురువారం ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్లో ఆర్మీ జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ (జేసీఓ) అమరుడైనట్లు రక్షణ శాఖ అధికార ప్రతినిధి చెప్పారు. పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, థనమండి బెల్ట్‌లో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం రావడంతో గాలింపు జరిపినపుడు ఎన్‌కౌంటర్ జరిగింది. 


సోదాలు నిర్వహిస్తుండగా భద్రతా దళాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారని, వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు ప్రతిస్పందించాయని పోలీసు అధికారులు తెలిపారు. 


జమ్మూ డిఫెన్స్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ దేవేందర్ ఆనంద్ మాట్లాడుతూ, రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ (జేసీఓ) ఉగ్రవాదుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డారని, ఆయనను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించామని, అయినప్పటికీ ఫలితం లేకపోయిందని, ఆయన అమరుడయ్యారని తెలిపారు. 


రాజౌరీ ఎస్‌పీ షీమా నబి కస్బా మాట్లాడుతూ భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ కొనసాగుతోందని చెప్పారు. ఈ ఏడాది ఆగస్టులో ఈ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్లలో ఇది రెండోది. ఆగస్టు 6న జరిగిన ఎన్‌కౌంటర్లో ఇద్దరు లష్కరే తొయిబా ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. 



Updated Date - 2021-08-19T19:56:35+05:30 IST