అమ్మాయిలైనా అబ్బాయిలైనా తమ జుట్టు అందంగా మారాలంటే సెలూన్ మెట్లు ఎక్కాల్సిందే. కానీ మనం వెళ్లే సెలూన్ ఎలాంటిదో ముందుగానే తెలుసుకోవాలి. లేదంటే ఒక్కోసారి కొన్ని ప్రమాదాలు జరుగుతుంటాయి. సరిగ్గా ఇలాంటి ఘటనే మధ్యప్రదేశ్ రాజధాని ఇండోర్‌లో జరిగింది.
ఒక ఆర్మీ ఆఫీసర్ భార్య.. స్థానికంగా కొంచెం పేరున్న ఒక సెలూన్‌కు వెళ్లింది. అక్కడ హెయిర్ ట్రీట్మెంట్ తర్వాత ఆమె జుట్టు కాలిపోయిందట. దీంతో ఆగ్రహం తెచ్చుకున్న ఆమె.. పోలీసులను ఆశ్రయించింది. సదరు సెలూన్లో కొన్ని వాడకూడని కెమికల్స్ వాడారని, దాంతో తన జుట్టు కాలిపోయిందని ఫిర్యాదు చేసింది.
కంప్లయింట్ రిజిస్టర్ చేసుకున్న పోలీసులు.. సదరు సెలూన్ సూపర్వైజర్ శుభమ్ గుప్తా, మేనేజర్ భావనా విజయ్ తలరేజా, ఉద్యోగి రాజ్‌కుమార్ ప్రకాశ్సింహ్ ముగ్గురిపై కేసు నమోదు చేసుకున్నారు. కేసు విచారణలో ఉందని అధికారులు చెప్పారు. అయితే ఈ ఫిర్యాదుకు సంబంధించి ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదని తెలిసింది.
ఇవి కూడా చదవండి