న్యూఢిల్లీ: ఆర్మీ.. దేశ రక్షణ వ్యవస్థలో అత్యంత కీలకమైనది. దీని ప్రధాన కర్తవ్యం భూభాగాన్ని పరిరక్షించడంతో పాటు దేశంలో శాంతి భద్రతలు, సరిహద్దుల భద్రతను పర్యవేక్షించడం. ఈ సైన్యం అవసరమయినపుడు మాత్రమే రంగంలోకి దిగుతుంది. ఆర్మీలో చేరిన తర్వాత సైనికుల శిక్షణ అత్యంత కఠినంగా ఉంటుంది. తాజాగా ఇలాంటి విన్యాసాలకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆర్మీ శిక్షణలో భాగంగా స్కై డైవింగ్ నిర్వహించారు. భూమికి చాలా ఎత్తులో ముగ్గురు సైనికులు ఆకాశంలో చేసిన విన్యాసాలు ఊపిరి బిగబట్టేలా చేశాయి.