మంద కృష్ణ పోరాటాల ఫలితమే ఆరోగ్యశ్రీ

ABN , First Publish Date - 2022-08-08T05:22:54+05:30 IST

ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ చిన్నారుల ఆరోగ్యం కోసం 2004లో చేసిన ఉద్యమాల ఫలితంగానే ఆరోగ్యశ్రీ పథకాన్ని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖ ర్‌రెడ్డి ప్రవేశ పెట్టారని ఎమ్మార్పీఎస్‌ నాయకుడు ఎర్రకోట చంద్ర తెలి పారు.

మంద కృష్ణ పోరాటాల ఫలితమే ఆరోగ్యశ్రీ
పీటీఎంలో పాల్గొన్న ఎమ్మార్పీఎస్‌ నాయకులు

పెద్దతిప్పసముద్రం ఆగస్టు 7 : ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ చిన్నారుల ఆరోగ్యం కోసం 2004లో  చేసిన ఉద్యమాల ఫలితంగానే ఆరోగ్యశ్రీ పథకాన్ని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖ ర్‌రెడ్డి ప్రవేశ పెట్టారని ఎమ్మార్పీఎస్‌ నాయకుడు ఎర్రకోట చంద్ర తెలి పారు. 2004 ఆగస్టు 7న ఆరోగ్యశ్రీ పథకం రూపు దిద్దుకుందని దీనిని పురష్కరించుకుని ఆదివారం స్థానిక అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ఎమ్మార్పీ ఎస్‌ నాయకులు కేకును కట్‌ చేసి అందరికి పంచిపెట్టారు.   ఎమ్మార్పీ ఎస్‌ తంబళ్ళపల్లె ఇన్‌చార్జ్‌ దుమ్ము చిన్నా, రవి,   పెద్దన్న, వెంకటప్ప చౌడప్ప, చిన్నరామన్న, రాజు, నరసింహులు,  తదితరులు పాల్గొన్నారు. 

బి.కొత్తకోటలో : ఆరోగ్యశ్రీ పథకం ఆవిర్భావ దినోత్సవాన్ని పురష్కరిం చుకుని ఎమ్మార్పీఎస్‌ నాయకులు స్థానిక జ్యోతి బస్టాండులో కేకు కట్‌ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. ఈ సందర్బంగా తంబళ్ళపల్లె నియో జక వర్గ ఇన్‌చార్జ్‌ దుమ్ము చిన్నా మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్‌ పోరాటాల పలితంగానే నేడు రెండు తెలుగు రాష్ర్టాల్లోనూ ఆరోగ్యశ్రీ పథకం అమలు అవుతోందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్‌ నాయకులు భవాని వెంకటేష్‌, చౌడప్ప, గంగన్న, సదుం వెంకటప్ప, మల్లెల రవి,  గణేష్‌, బాస్కర, ఆంజి, నరేష్‌, తదితరులు పాల్గొన్నారు. 

మదనపల్లె అర్బన్‌లో:  మదనపల్లెలో ఆరోగ్యశ్రీ సాధన దినోత్సావాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా నరేంద్రబాబు మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్‌ అధినేత మందకృష్ణమాదిగ నాయకత్వంలో 2004లో గుండె జబ్బు చిన్నారుల ఉద్యమంలో భాగస్వాములు అయినం దుకు గర్వంగా ఉందని పేర్కొన్నారు.  కార్యక్రమంలో నాయకులు రవీంద్ర, వేణుగోపాల్‌, మనోహర్‌, రాజా, రవి, రెడ్డిశేఖర్‌, రమణ, మధు, చిన్నా, నరసంహులు, నాగరాజ, గంగాధర్‌, శివ, పాల్గొన్నారు. 

పీలేరులో: మానవీయ పథకంగా అందరి మన్ననలు అందుకుంటున్న ఆరోగ్యశ్రీ పథకం తమ ఉద్యమాల కారణంగానే ఆవిర్భవించిందని పీలేరులోని ఎంఎస్‌పీ నాయకుడు డాక్టర్‌ గోపీ పేర్కొన్నారు. పీలేరులో ఆదివారం ఎంఆర్‌పీఎస్‌, ఎంఎస్‌పీ ఆధ్వర్యంలో ఆరోగ్యశ్రీ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంఆర్‌పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ నేతృత్వంలో గుండె జబ్బుల చిన్నారుల కోసం చేపట్టిన ఉద్యమం కారణంగానే ఆరోగ్యశ్రీ పథకం రూపుదిద్దుకుందని ఈ విషయాన్ని ఆనాటి ముఖ్యమంత్రి దివంగత వైఎస్‌రాజశేఖర రెడ్డి అసెంబ్లీలోనే ప్రకటించా రని గుర్తు చేశారు. ఒకవైపు వర్గీకరణ కోసం పోరాడుతూనే మరోవైపు సమాజంలోని అన్ని వర్గాల కోసం మందకృష్ణ ఉద్యమించారని ఆయన ఉద్యమాల కారణంగానే 2008లో దివ్యాంగులు, 2013లో వృద్ధులు, వితంతువుల పెన్షన్‌ పెంపు, రేషన్‌ బియ్యం కోటాపెంపు, 2018లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్టు పునరుద్ధరణ, 2021లో ఆడబిడ్డలపై జరుగుతున్న అఘాయిత్యాల సత్వర విచారణకు ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టుల ఏర్పాటు జరిగా యన్నారు. కేవీపల్లెలోనూ ఆరోగ్యశ్రీ సాధనోత్సవాలు జరిగాయి. వేర్వేరు గా జరిగిన ఈ కార్యక్రమాల్లో నాయకులు దుడ్డు రామకృష్ణ, బేతపురి వెంకటరమణ, శ్రీనివాసులు, కొండయ్య, ప్రసాద్‌, రమణ పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-08T05:22:54+05:30 IST