ఐపీఎల్‌లో ఆరోన్ ఫించ్ పేరిట అరుదైన రికార్డ్

ABN , First Publish Date - 2022-04-16T03:23:20+05:30 IST

ముంబై : ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. ఐపీఎల్‌లో సత్తాచాటి జాతీయ జట్టులో చోటు దక్కించుకోవాలని యువ క్రికెటర్లు కలలు కంటున్నారు.

ఐపీఎల్‌లో ఆరోన్ ఫించ్ పేరిట అరుదైన రికార్డ్

ముంబై : ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. ఐపీఎల్‌లో సత్తాచాటి జాతీయ జట్టులో చోటు దక్కించుకోవాలని యువ క్రికెటర్లు కలలు కంటున్నారు. ఇక విదేశీ స్టార్ ఆటగాళ్లు సైతం ఐపీఎల్‌లో ఆడాలని ఉవ్విళ్లూరుతుంటారు. అంతటి ఆదరణ కలిగిన ఐపీఎల్‌లో ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 9 జట్ల తరపున ప్రాతినిధ్యం వహించాడు ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్. అలెక్స్ హేల్స్ స్థానంలో ఆరోన్ ఫించ్‌ను తీసుకుంటున్నామని కలకత్తా నైట్ రైడర్స్ ప్రకటించడంతో ఫించ్ ప్రాతినిధ్యం వహించిన టీంల సంఖ్య పెరిగింది. మొత్తం 11 ఏళ్ల ఐపీఎల్ కెరీర్‌లో 9 జట్లకు ఆడినట్టయ్యింది. ఫించ్ ప్రాతినిధ్యం వహించిన టీమ్స్‌లో రాజస్థాన్ రాయల్స్(2010), ఢిల్లీ డేర్‌డెవిల్స్(2011-22), పుణె వారియర్స్(2013), సన్‌రైజర్స్ హైదరాబాద్(2014), ముంబై ఇండియన్స్(2015), గుజరాత్ లయన్స్(2016-17), పంజాబ్ కింగ్స్(2018), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(2020)తోపాటు ప్రస్తుత సీజన్ 2022లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఆడనున్నాడు.  అంతర్జాతీయ క్రికెట్‌లో అద్భుత రికార్డులను నెలకొల్పిన ఆరోన్ ఫించ్.. ఐపీఎల్‌లోనూ ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. మొత్తం 10 సీజన్లు ఆడి 2005 పరుగులు చేశాడు. 25.70 పరుగుల సగటును కలిగివున్నాడు. 

Updated Date - 2022-04-16T03:23:20+05:30 IST