దాదాపు 20 మంది విద్యార్థులు.. ఇప్పటికీ ఉక్రెయిన్‌లోనే.. విదేశీ వ్యవహారాల శాఖ ప్రకటన

ABN , First Publish Date - 2022-03-18T02:25:13+05:30 IST

ఉక్రెయిన్‌లో 15 నుంచి 20 మంది భారతీయ విద్యార్థులు చిక్కుకుపోయిన ఉన్నారని కేంద్రం అంచనా వేస్తున్నట్టు విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్జీ తాజాగా పేర్కొన్నారు.

దాదాపు 20 మంది విద్యార్థులు.. ఇప్పటికీ ఉక్రెయిన్‌లోనే.. విదేశీ వ్యవహారాల శాఖ ప్రకటన

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌లో 15 నుంచి 20 మంది భారతీయ విద్యార్థులు చిక్కుకుపోయిన ఉన్నారని కేంద్రం అంచనా వేస్తున్నట్టు విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్జీ తాజాగా పేర్కొన్నారు. వీరిని భారత్‌కు రప్పిస్తామని తెలిపారు. ఇప్పటివరకూ 22500 మంది భారతీయులు స్వదేశానికి తిరిగివచ్చారన్నారు. రష్యా దాడి నేపథ్యంలో ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తరలించేందుకు కేంద్రం ఆపరేషన్ గంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. కేవలం భారతీయులనే కాక.. ఇతర దేశాల వారిని కూడా కేంద్రం ఈ మిషన్ ద్వారా వారి వారి దేశాలకు తరలించింది. 

Updated Date - 2022-03-18T02:25:13+05:30 IST