Kuwait: ప్రవాసులకు కువైత్ మరో షాక్.. 6నెలల్లోనే 8వేల డ్రైవింగ్ లైసెన్ల ఉపసంహరణ

ABN , First Publish Date - 2022-08-06T14:07:33+05:30 IST

గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) ప్రవాసులకు మరో గట్టి షాక్ ఇచ్చింది.

Kuwait: ప్రవాసులకు కువైత్ మరో షాక్.. 6నెలల్లోనే 8వేల డ్రైవింగ్ లైసెన్ల ఉపసంహరణ

కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) ప్రవాసులకు మరో గట్టి షాక్ ఇచ్చింది. ఈ ఏడాది మొదటి 6నెలల్లో ఏకంగా 8వేల మంది ప్రవాసుల డ్రైవింగ్ లైసెన్లను (Driving licenses) ఉపసంహరించింది. డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు కావాల్సిన షరతులను వారు అందుకోలేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. అలాగే కువైటీ పౌరులకు చెందిన మరో 50 డ్రైవింగ్ లైసెన్లు బ్లాక్ చేసింది. కువైత్ పౌరుల దృష్టి, మానసిక వైకల్యాల కారణంగా ఇలా వారి లైసెన్స్‌ను బ్లాక్ చేయడం జరిగింది. ప్రవాసులకు (Expats) డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు ప్రధానంగా శాలరీ, ప్రొఫెషన్, యూనివర్శిటీ డిగ్రీ వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. ఒకవేళ డ్రైవింగ్ లైసెన్ పొందినప్పుడు ఉన్న జాబ్ ప్రొఫెషన్ ఆ తర్వాత కొత్త ఉద్యోగంలో మారితే అలాంటి ప్రవాసుల డ్రైవింగ్ లైసెన్స్ (Driving license) వెనక్కి తీసుకోవడం జరుగుతుంది. అలాగే ప్రవాస విద్యార్థుల ఎవరైతే స్టడీస్‌ పూర్తి చేసుకుంటారో వారి డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉపసంహరించడం జరుగుతుంది. డొమెస్టిక్ వర్కర్లు (Domestic workers) ఎవరైతే స్పాన్సర్ నుంచి తప్పించుకుని హోం డెలివరీ ప్రొఫెషన్‌ను ఎంచుకుంటారు అలాంటి వారి డ్రైవింగ్ లైసెన్స్ కూడా ట్రాఫిక్ విభాగం వెనక్కి తీసుకుంటుంది.  

Updated Date - 2022-08-06T14:07:33+05:30 IST