ltrScrptTheme3

పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు

Oct 25 2021 @ 00:20AM

చిత్తూరు కలెక్టరేట్‌, అక్టోబరు 24: జిల్లావ్యాప్తంగా గత ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగిన తర్వాత ఇప్పటి పలు పంచాయతీల్లో ఆరు సర్పంచు, 44 వార్డు స్థానాలకు ఖాళీలు ఏర్పాడ్డాయి. ఈ వివరాలను జిల్లా పంచాయతీ అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేపట్టాలని, త్వరలో నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని ప్రభుత్వం సూచిందింది. దీంతో డీపీవో కార్యాలయ సిబ్బంది ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. జిల్లాలోని 1369 పంచాయతీలు, 13574 వార్డులకు ఈ ఏడాది ఫిబ్రవరిలో నాలుగు విడతలుగా ఎన్నికలు జరిగాయి. గత తొమ్మిది నెలల వ్యవధిలో పలువురి రాజీనామాలు, మరణాలు తదితర కారాణాలతో 33 మండలాల పరిధిలో ఆరు సర్పంచ్‌, 44 వార్డు స్థానాలకు ఖాళీలు ఏర్పాడ్డాయి. ఖాళీ స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు 63 పోలింగ్‌ కేంద్రాలు, 215 మంది సిబ్బంది అవసరమని కలెక్టర్‌ హరినారాయణన్‌ ఎన్నికల సంఘానికి నివేదిక పంపారు. ఎన్నికలకు అవసరమైన బ్యాలెట్‌ పెట్టెలు, పేపర్లను సిద్ధం చేసుకోవాలని ఎంపీడీవోలను కలెక్టర్‌ ఆదేశించారు. అలాగే రిసెప్షన్‌, స్ట్రాంగ్‌రూం, ఓట్ల లెక్కింపు కేంద్రాల కోసం అనువైన భవనాలను గుర్తించాలని సూచించారు. శనివారం పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు సంబంధించి తాజా ఓటర్ల జాబితాను ప్రచురించారు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.