ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్‌కు ఏర్పాట్లు

ABN , First Publish Date - 2021-11-28T06:21:14+05:30 IST

ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల శాసనమండలి నియోజకవర్గ కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేయాలని రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌ ఆదేశించారు.

ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్‌కు ఏర్పాట్లు
ఏర్పాట్లను పరిశీలిస్తున్న కలెక్టర్‌ ప్రశాంత్‌జీవన్‌ పాటిల్‌

జిల్లా మహిళా సమాఖ్య భవనాన్ని పరిశీలించిన కలెక్టర్‌


నల్లగొండ టౌన్‌, నవంబరు 27: ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల శాసనమండలి నియోజకవర్గ కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేయాలని రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌ ఆదేశించారు. శనివారం జిల్లా కేంద్రంలోని టీటీడీసీలో గల జిల్లా మహిళా సమాఖ్య (డీఆర్‌డీఓ) భవనాన్ని పరిశీలించారు. డిసెంబరు 14న కౌంటింగ్‌ నిర్వహణకు చేయాల్సిన ఏర్పాట్లపై కలెక్టర్‌ పలు సూచనలు జారీ చేశారు. డిసెంబరు 10న పోలింగ్‌ అనంతరం ఉమ్మడి నల్లగొండ జిల్లా డివిజన్‌ కేంద్రాల నుంచి  పోలింగ్‌ మెటీరియల్‌ స్వీకరణకు రిసెప్షన్‌ కేంద్రం ఏర్పాటు, పోలింగ్‌ మెటీరియల్‌, పోలింగ్‌ బాక్సులు, భద్రపర్చేందుకు స్ట్రాంగ్‌ రూంకు సీసీ కెమెరాల ఏర్పాట్లు, భద్రత, కౌంటింగ్‌ ఏజెంట్లకు ప్రవేశం, బారీ కేడింగ్‌, పార్కింగ్‌, మీడియా రూం ఇతర ఏర్పాట్లపై చర్చించి అధికారులకు సూచనలు చేశారు. కౌంటింగ్‌ కేంద్రంలో గుర్తింపు కార్డు కలిగి కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ రెండు డోస్‌లు పూర్తయినట్లు ధ్రువీకరణ చూపించిన వారినే ఎన్నికల కమిషన్‌ నిబంధనల మేరకు అనుమతించనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీవో జగదీశ్వర్‌రెడ్డి, డీఆర్‌డీవో కాళిందిని, కలెక్టర్‌ కార్యాలయ సూపరింటెండెంట్‌ కృష్ణమూర్తి, ఎన్నికల డీటీ విజయ్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2021-11-28T06:21:14+05:30 IST