ఎన్టీఆర్‌ వర్ధంతికి ఏర్పాట్లు: మాదినేని ఉమా

ABN , First Publish Date - 2021-01-17T05:56:11+05:30 IST

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు వర్ధంతిని ఈనెల 18న నిర్వహించేందు కు ఏర్పాట్లు చేస్తున్నట్లు నియోజకవర్గ ఇనచార్జి మాదినేని ఉమామహేశ్వర్‌నాయుడు తెలిపారు.

ఎన్టీఆర్‌ వర్ధంతికి ఏర్పాట్లు: మాదినేని ఉమా
సమావేశంలో మాట్లాడుతున్న టీడీపీ నియోజకవర్గ ఇనచార్జి ఉమా

కళ్యాణదుర్గం, జనవరి 16: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు వర్ధంతిని ఈనెల 18న నిర్వహించేందు కు ఏర్పాట్లు చేస్తున్నట్లు నియోజకవర్గ ఇనచార్జి మాదినేని ఉమామహేశ్వర్‌నాయుడు తెలిపారు. శనివారం స్థానిక ఎన్టీఆర్‌ భవనలో నాయకులు దొ డగట్ట నారాయణ, బిక్కి గోవిందప్ప, మాదినేని మురళి, రామరాజు, తలారి సత్యప్పతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. వర్ధంతిని పురస్కరిం చుకుని ఉదయం 9 గంటలకు ఎన్టీఆర్‌ భవన వద్ద విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులర్పిస్తామన్నారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మానవసేవయే మాధవసేవ నినాదంతో రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలన్నారు. మాజీ ప్ర జాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు. సమావేశంలో నాయకులు తిమ్మప్పయాదవ్‌, ఆంజినేయులు, బిక్కి గోవిందరాజులు, నాగరాజు లోకేష్‌, బసవరాజు, లాల్‌కృష్ణ, దొణతిమ్మప్ప, శ్రీధర్‌, నారాయణయాదవ్‌ పాల్గొన్నారు. 


మోరేపల్లిలో..

కళ్యాణదుర్గం మండలం మోరేపల్లిలో సోమవారం నిర్వహించే ఎన్టీఆర్‌ వర్ధంతికి తరలిరావాలని టీడీపీ కన్వీనర్‌ డీకే రామాంజినేయులు శనివారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలిరావాలని కోరారు. అలాగే రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉన్నం హనుమంతరాయచౌదరి ఆధ్వర్యంలో ఆసుపత్రిలో బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేస్తామని తెలిపారు.


బొమ్మనహాళ్‌ : రాయదుర్గంలో ఈనెల 18న తెలుగుదేశం వ్యవస్థాపకుడు, దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు టీడీపీ మండల కన్వీనర్‌ బలరామిరెడ్డి తెలిపారు. శనివారం ఆయన స్థానికంగా విలేకరులతో మాట్లాడారు. మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు ఆధ్వర్యంలో జరిగే ఈశిబిరానికి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చి రక్తదానం చేసి విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో సింగిల్‌విండో మాజీ అధ్యక్షుడు కొత్తపల్లి మల్లికార్జున, మాజీ జడ్పీటీసీ కుమ్మరి మల్లికార్జున, నా యకులు మోహన, జగన్నాథరెడ్డి, ధనుంజయ పాల్గొన్నారు.

Updated Date - 2021-01-17T05:56:11+05:30 IST