చేప పిల్లల విడుదలకు ఏర్పాట్లు పూర్తి

ABN , First Publish Date - 2020-08-07T06:29:38+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమం కోసం జిల్లాలో నాలుగేళ్లుగా అమలుచేస్తున్న ఉచిత చేప పిల్లల పంపిణీ

చేప పిల్లల విడుదలకు ఏర్పాట్లు పూర్తి

నేడు శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులో చేప పిల్లలను విడుదల చేయనున్న మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి 


నిజామాబాద్‌, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమం కోసం జిల్లాలో నాలుగేళ్లుగా అమలుచేస్తున్న ఉచిత చేప పిల్లల పంపిణీ పథకాన్ని ఈ యేడాది కూడా ప్రారంభించేందుకు అ ధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులో రాష్ట్ర రోడ్లు భవ నాలు, గృహనిర్మాణం, అసెంబ్బీ వ్యవహారాల శాఖ మం త్రి వేముల ప్రశాంత్‌రెడ్డి చేప పిల్లలను విడుదల చేయ నున్నారు. జిల్లాలో చేప పిల్లలను సరఫరా చేసేందుకు అధికారులు ఇప్పటికే టెండర్లను పిలిచారు. మూడు సొసైటీలవి సక్రమంగా ఉండటంతో వాటిని ఖరారు చే శారు. చెరువులో వేసేందుకు నిబంధనలు మేరకు సైజు ల వారీగా చేప పిల్లలను సరఫరా చేయాలని అదేశాలు ఇచ్చారు. మత్సకారుల సంక్షేమం కోసం జిల్లాలో గత నాలుగేళ్లుగా ప్రభుత్వం చేప పిల్లలను ఉచితంగానే అం దిస్తోంది. శ్రీరాంసాగర్‌, అలీసాగర్‌, రామడుగు ప్రాజె క్టులలో వీటిని వేస్తున్నారు. జిల్లాలో మొత్తం 1204 చె రువులు, కుంటలు ఉన్నాయి. వీటిలో చేపలు పెరిగేందు కు అనుకూలంగా 895 చెరువులు ఉన్నాయి. జిల్లాలోని ఈ చెరువులలో సుమారు నాలుగున్నర కోట్ల వరకు ప్ర తీ సంవత్సరం చేప పిల్లల కోసం ఖర్చు చేస్తున్నారు.


గత సంవత్సరం 880 చెరువులలో 4 కోట్ల 44 లక్షల చేప పిల్లలను వదిలారు. జిల్లాలో 3 కోట్ల 27 లక్షల రూపా యలు ఖర్చు చేశారు. గత సంవత్సరం వర్షాలు బాగా పడటం, చెరువులలో నీళ్లు ఉండటంతో చేప పిల్లలను ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో వేశారు. జిల్లాలో ఈ సంవ త్సరం కూడా 4 కోట్ల 50 లక్షల చేప పిల్లలను చెరువుల లో వదిలేందుకు నిర్ణయించారు. జిల్లాలో ప్రతి సంవత్స రం చేప పిల్లల పంపిణీని తమకే ఇవ్వాలని కొన్ని మ త్సకార సొసైటీల సభ్యులు కోరుతున్నారు. జిల్లాలో ఈ సొసైటీలు 249 ఉన్నాయి. వీటిలో 16,826 మంది సభ్యు లు ఉన్నారు. వీటితో పాటు 33 మహిళా సొసైటీలు ఉండగా వీటిలో 2,136 మంది సభ్యులు ఉన్నారు. ప్ర భుత్వ నిబంధనల ప్రకారం చేప పిల్లల ఉత్పత్తి, సరఫ రా చేసే సంస్థలకే ఇవ్వాలి. ఆ నిబంధనల ప్రకారం మ త్స్యకార సొసైటీలకు అవకాశం రావడం లేదు, టెండర్లు వేసే వారికి చేపపిల్లల ఉత్పత్తి ఉ న్న కొన్నిసార్లు వారు కూడా తక్కు వగా ఉంటే ఆంధ్రా ప్రాంతం నుంచి తెప్పించి వేస్తున్నారు.


ప్రభుత్వ పరం గా శ్రీరాంసాగర్‌లో  చేప పిల్లల ఉత్పత్తి చేస్తున్న అవి సరిపోను లేకపోవడం వల్ల ఈ టెండర్లు పిలుస్తున్నారు. ఈ చేప పిల్లల చెరువులలో వేసే సమయంలో సక్రమంగా లె క్కించక పోవడం, సైజు ఉండటం లేదని మ త్సకారులు ఆరోపిస్తున్నారు. అధికారులకు చెప్పిన రాజ కీయ ఒత్తిళ్లు ఉండటంతో పట్టించుకోవడం లేదని వా రంటున్నారు. కొన్ని పిల్లలు చిన్నగా ఉండటం వల్ల వేసి న సమయంలో వాతావరణం అనుకూలించక చనిపో తున్నాయి. జిల్లాలో చేప పిల్లల పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేసినప్పటికీ భారీ వర్షాలు లేకపోవడం వల్ల ఇంకా చెరువులలో నీళ్లు రాలేదు. జిల్లాలో 25 శాతం చె రువులలోనే సగం వరకు నీళ్లు ఉన్నాయి. వర్షాలు పడి తేనే చెరువులలోకి నీళ్లు వచ్చే అవకాశం ఉంది. 


మొదట శ్రీరాంసాగర్‌ జలాశయం లో వేసి ఆ తర్వాత చెరువులలో వేసేం దుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో ప్రతి యేడాది నిబంధనలకు అనుగుణంగానే టెండర్లు ఖరా రు చేస్తున్నామని జిల్లా మత్స్య అభివృద్ధి అధికారి మీ సాల రాజారాం తెలిపారు. జిల్లా కమిటీ ఆధ్వర్యంలోనే వీటిని ఖరారు చేశామన్నారు. ప్రతి సంవత్సరం చేప పిల్లల సైజు చూసి లెక్కిస్త్తున్నామన్నారు. చెరువులలో వేస్తున్న ఈ చేప పిల్లల వల్ల మత్స్యకారులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ప్రతి యేడాది చెరువులలో చేపలు అధికంగా ఎదగడం వల్ల వారి ఆర్థిక అభివృద్ధికి ఉపయోగపడుతుందన్నారు. ఈ సారి కూడా పెద్ద మొ త్తంలో చేప పిల్లలు వేసేందుకు నిర్ణయించామన్నారు.

Updated Date - 2020-08-07T06:29:38+05:30 IST