సమావేశంలో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, పాల్గొన్న జిల్లా అధికారులు
- అధికారుల సమీక్షలో అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి
నారాయణపేట టౌన్, జనవరి 23 : ఈనెల 26న గణతంత్ర దినోత్సవాన్ని జిల్లాలో ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో గణతంత్ర దినోత్సవ నిర్వహణపై సమావేశం ఏర్పాటు చేశా రు. గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించేందుకు ఆయా శాఖల అధికారులకు బా ధ్యతలు అప్పగించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ కలెక్టరేట్ ఆవరణలోనే జా తీయ పతాకా విష్కరణకు తగు ఏర్పాట్లు చేయాలని సూచించారు. కొవిడ్ 19ను దృష్టిలో ఉంచుకొని శానిటైజర్లు, మాస్కులు ఏర్పాటు చేయాలని, అంబులెన్స్‌ను సిద్ధంగా ఉంచాలని, అగ్ని మాపక సిబ్బంది సైతం వాహనాన్ని అందుబాటులో ఉంచాలని ట్రాన్స్‌కో అధికారులు విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని ఆయన సూచించారు. ప్రముఖులకు ఆహ్వానం పంపించడం తదితర ఏర్పాట్లలో జాగ్రత్తలు వహించాలని సూచించారు. సమావేశంలో జిల్లా అడిషనల్ ఎస్పీ భరత్ కుమార్, డీఆర్డీఓ కాళిందిని, జిల్లా అధికారులు పాల్గొన్నారు.