నకిలీ వేలిముద్రలతో బయోమెట్రిక్‌ హాజరు

ABN , First Publish Date - 2021-04-22T06:27:59+05:30 IST

కొన్నేళ్లుగా నకిలీ వేలిముద్రలతో పారిశుధ్య కార్మికుల జీతాలు కాజేస్తున్న ఇద్దరు శానిటరీ ఫీల్డ్‌ అసిస్టెంట్లను సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు.

నకిలీ వేలిముద్రలతో బయోమెట్రిక్‌ హాజరు
నిందితులు

 కార్మికులు విధులకు హాజరు కాకపోయినా జీతం 

ఇద్దరు ఎస్‌ఎ్‌ఫఏల అరెస్టు 

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): కొన్నేళ్లుగా నకిలీ వేలిముద్రలతో పారిశుధ్య కార్మికుల జీతాలు కాజేస్తున్న ఇద్దరు శానిటరీ ఫీల్డ్‌ అసిస్టెంట్లను సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. తలాబ్‌కట్ట భవానీనగర్‌కు చెందిన మహ్మద్‌ హాజీ అహ్మద్‌ (38), మొఘల్‌పురాకు చెందిన మహ్మద్‌ లాయక్‌(42) భవానీనగర్‌ ప్రాంతంలో ఎస్‌ఎఫ్‌ఏలుగా పనిచేస్తున్నారు. ఇద్దరూ సులభంగా డబ్బు సంపాదించాలనుకున్నారు. తమ కుటుంబాలకు చెందిన ఐదుగురిని పారిశుధ్య కార్మికులుగా నియమించుకున్నారు. వారు విధులకు హాజరు కాకపోయినా నకిలీ వేలిముద్రలతో హాజరైనట్లు వారి జీతాన్ని కొన్నేళ్లుగా తీసుకుంటున్నారు. విషయం తెలియడంతో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించారు. వారి నుంచి 5 నకిలీ వేలిముద్రలు, రెండు బయోమెట్రిక్‌ మెషీన్లు, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం నిందితులిద్దరినీ, స్వాధీనం చేసుకున్న సామగ్రిని భవానీనగర్‌ పోలీసులకు అప్పగించారు. 

Updated Date - 2021-04-22T06:27:59+05:30 IST