అంతర్రాష్ట్ర దొంగల అరెస్టు

ABN , First Publish Date - 2022-07-07T02:41:58+05:30 IST

దొంగతనాలు, దారిదోపిడీలు, చైన్‌ స్నాచింగ్‌లకు పాల్పడే అంతర్రాష్ట్ర దొంగలు తొమ్మిది మందిని అరెస్టు చేసి వారి నుంచి దాదాపు రూ.20 లక్షల

అంతర్రాష్ట్ర దొంగల అరెస్టు

కడప: దొంగతనాలు, దారిదోపిడీలు, చైన్‌ స్నాచింగ్‌లకు పాల్పడే అంతర్రాష్ట్ర దొంగలు తొమ్మిది మందిని అరెస్టు చేసి వారి నుంచి దాదాపు రూ.20 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామని వైఎస్సార్‌ కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్‌ తెలిపారు. జిల్లాలోని ప్రొద్దుటూరు, కడప, పులివెందులలోని పలు ఇళ్లల్లో చోరీలు, దారిదోపిడీలు, చైన్‌ స్నాచింగ్‌లు జరిగాయి. వీటికి సంబంధించి నిఘా పెట్టిన పులివెందుల పోలీసులు కర్ణాటక రాష్ట్రం రాయచూరు, బాగల్‌కోట్‌ జిల్లాకు చెందిన రమేష్‌, సుంకప్పను అరెస్టు చేసి 59 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే మన రాష్ర్టానికి చెందిన మల్లికా గ్యాంగ్‌ అనే ముఠా సభ్యులైన మల్లికా శ్యామల, మల్లికా వెంకటేశ్‌, మల్లికా ఇరుపురం, మల్లికా అంజి, మల్లికా ఇంద్ర, రాగి నాగరాజును అరెస్టు చేశారు. వీరితో పాటు ఒక బాలుడు కూడా అరెస్టయ్యాడు. ఇతడిని జువైనల్‌ హోంకు తరలించారు. నిందితుల నుంచి 175.11 గ్రాముల బంగారు ఆభరణాలు, ఒక ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు. 

Updated Date - 2022-07-07T02:41:58+05:30 IST