డ్రగ్స్ కేసులో అరెస్ట్‌ల పర్వం

ABN , First Publish Date - 2022-02-05T01:02:13+05:30 IST

డ్రగ్స్ కేసులో అరెస్ట్‌ల పర్వం కొనసాగుతోంది. ప్రధాన సూత్రధారి

డ్రగ్స్ కేసులో అరెస్ట్‌ల పర్వం

హైదరాబాద్: డ్రగ్స్ కేసులో అరెస్ట్‌ల పర్వం కొనసాగుతోంది. ప్రధాన సూత్రధారి టోనీకి బ్యాంక్ అకౌంట్లు తెరిచేందుకు సహకరించిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబయిలో టోనీ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్న అఫ్తాబ్, ఇర్ఫాన్, అరిఫ్‌లను హైద్రాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు అసిఫ్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తూ డ్రగ్స్ సప్లై చేసేవాడు. అఫ్తాఫ్ అహమేడ్ ఖాన్ అందేరీలో ఉంటూ మొబైల్ రిపేర్ పని చేస్తూ డ్రగ్స్‌లో ఇన్‌వాల్వ్ అయ్యాడు. ఇర్ఫాన్ మోబైల్ రిపేర్ షాప్‌లో చేస్తూ డ్రగ్స్ దందా చేస్తుండే వారు. ముగ్గురిని అరెస్ట్ చేసి 14వ నాంపల్లి మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు పంజాగుట్ట పోలీసులు హాజరు పరిచారు.

Updated Date - 2022-02-05T01:02:13+05:30 IST