కోడి పందెంరాయుళ్ల అరెస్టు

ABN , First Publish Date - 2021-01-16T06:24:18+05:30 IST

పట్టణంలోని పోర్టర్‌లైన రైల్వే గూడ్స్‌ షెడ్‌ వద్ద కోడి పందేలు ఆడుతున్న 14 మందిని శుక్రవారం వనటౌన పో లీసులు అరెస్టు చేశారు.

కోడి పందెంరాయుళ్ల అరెస్టు
గుంతకల్లులో కోడి పందెంరాయుళ్లను అరెస్టు చేసిన పోలీసులు

గుంతకల్లు టౌన, జనవరి 15: పట్టణంలోని పోర్టర్‌లైన రైల్వే గూడ్స్‌ షెడ్‌ వద్ద కోడి పందేలు ఆడుతున్న 14 మందిని శుక్రవారం వనటౌన పో లీసులు అరెస్టు చేశారు. సీఐ షర్ఫుద్దీన అరెస్టు వివరాలు వెల్లడించారు. స మాచారం మేరకు సీఐ నాగశేఖర్‌ సిబ్బందితో దాడులు నిర్వహించారన్నా రు. కోడి పందెంరాయుళ్లను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి చనిపోయిన రెండు నాటుకోళ్లు, రూ.2,880 నగదు, 9 సెల్‌ ఫోన్లు స్వాధీనం చే సుకున్నామన్నారు. అలాగే జీ కొట్టాల రోడ్డులోని ఎస్‌ఎస్‌ ట్యాంకు వద్ద పే కాట ఆడుతున్న ఏడుగురిని అదుపులోకి తీసుకుని, రూ.10,120 నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. దాడుల్లో ఎస్‌ఐలు శ్రీనివాసులు, కొండన్న, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.


బెళుగుప్ప: మండలంలోని కోనంపల్లి, దుద్దేకుంట గ్రామ పరిసర ప్రాం తాల్లో ఎనిమిది మంది కోడి పందెంరాయుళ్లను శుక్రవారం అరెస్టు చేసిన్నట్లు ఎస్‌ఐ శ్రీనివాస్‌ తెలిపారు. కణేకల్లు, బెళుగుప్ప, కోనంపల్లికి చెందిన జూదరులు పందెం ఆడుతున్నట్లు సమాచారం అందడంతో సిబ్బందితో కలిసి దాడులు చేసి పట్టుకున్నామన్నారు. వారి నుంచి రూ.10300 నగదు,    రెండు కోళ్లను స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసినట్లు తెలిపారు. 


తాడిపత్రి: పట్టణ సమీపంలోని సీపీఐ కాలనీ వెనుకభాగంలో శుక్రవారం కోడిపందేలు నిర్వహిస్తున్న ఐదుగురిని అరె్‌స్ట చేశామని ఎస్‌ఐ ఖా జాహుస్సేన తెలిపారు. సమాచారం మేరకు దాడులు చేసి, రెండు కోడిపుంజులు, రెండు మోటార్‌సైకిళ్లు, ఆరుసెల్‌ఫోన్లతో పాటు రూ.1050 నగదు సీజ్‌ చేసినట్లు పేర్కొన్నారు. నిందితులపై కేసు నమోదుచేశామన్నారు. 


యల్లనూరు: మండలంలోని వెంకటాంపల్లి సమీపంలో జూదమాడుతున్న 8మందిని అదుపులోకి తీసుకొని, వారివద్ద నుంచి రూ.19300 నగదు స్వాధీనం చేసుకున్నామని ఎస్‌ఐ వెంకటప్రసాద్‌ తెలిపారు. తోటల్లో ఇతర ప్రాంతాల నుంచి వచ్చి జూదం ఆడుతున్నట్లు సమాచారం రావడంతో సిబ్బందితో దాడిచేసి పట్టుకున్నామన్నారు.


కూడేరు : స్థానికంగా పేకాట స్థావరాలపై గురువారం పోలీసులు దా డులు చేసి ఆరుగురు పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు.  వారి నుంచి రూ.7850 నగదు, మూడు ద్విచక్ర వాహనాలు, 5 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు హెడ్‌ కానిస్టేబుల్‌ అశోక్‌కుమార్‌ తెలిపారు.


తాడిపత్రి రూరల్‌: పట్టణ సమీపంలోని కొత్తబ్రిడ్జి వద్ద శుక్రవారం పే కాట ఆడుతున్న 12 మందిని అరె్‌స్ట చేసినట్లు ఎస్‌ఐ ఖాజాహుస్సేన తెలిపారు. వారి వద్ద నుంచి ఏడు సెల్‌ఫోన్లతో పాటు రూ.4650 నగదు, ఆటో, మోటార్‌సైకిల్‌ను సీజ్‌చేశామన్నారు.


Updated Date - 2021-01-16T06:24:18+05:30 IST