పేకాట స్థావరంపై దాడి

ABN , First Publish Date - 2021-05-11T05:37:44+05:30 IST

మండలంలోని పేరూరు గ్రామ సమీపంలో కోడిపిల్లవాగు వద్ద పేకాట(అందర్‌బహర్‌) ఆడుతుండగా దాడి చేసినట్లు ఎస్‌ఐ రామ్మోహన్‌రెడ్డి సోమవారం రాత్రి తెలిపారు.

పేకాట స్థావరంపై దాడి

  1. ఐదుగురి అరెస్టు  
  2. 17 మోటార్‌ సైకిళ్లు సీజ్‌ 


రుద్రవరం, మే 10: మండలంలోని పేరూరు గ్రామ సమీపంలో కోడిపిల్లవాగు వద్ద పేకాట(అందర్‌బహర్‌) ఆడుతుండగా దాడి చేసినట్లు ఎస్‌ఐ రామ్మోహన్‌రెడ్డి సోమవారం రాత్రి తెలిపారు. ఈ దాడిలో ఐదుగురిని అరెస్టు చేసినట్లు తెలిపారు. వారి వద్ద ఉన్న రూ.6,500 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. 13 మందిని గుర్తించామని, ఇంకా చాలా మంది పారిపోయారని తెలిపారు. 17 మోటార్‌ సైకిళ్లు సీజ్‌ చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. 

Updated Date - 2021-05-11T05:37:44+05:30 IST