కోడుమూరు(రూరల్),
జూన్ 24: మండలంలోని అమడగుంట్ల గ్రామంలో పేకాట ఆడుతున్న 14 మంది
పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్‌ఐ విష్ణు నారాయణ తెలిపారు. ఈ
సందర్బంగా ఆయన మాట్లాడుతూ స్థానిక గోడౌ ను వద్ద పేకాట ఆడుతున్న 14 మందిని
అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.5700 నగదు సీజ్ చేసి, కేసు నమోదు
చేసినట్లు ఆయన తెలిపారు.