TDP Leaders Arrest: పెదపారుపూడిలో టీడీపీ నేతల అరెస్ట్..ఉద్రిక్తం

ABN , First Publish Date - 2022-09-16T16:35:46+05:30 IST

జిల్లాలోని పెదపారుపూడిలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంది.

TDP Leaders Arrest: పెదపారుపూడిలో టీడీపీ నేతల అరెస్ట్..ఉద్రిక్తం

కృష్ణా: జిల్లాలోని పెదపారుపూడిలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంది.  టీడీపీ (TDP) బీసీ నాయకుడు ఈశ్వరరావుపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ నేతలు (TDP Leaders) నినాదాలు చేశారు. పెదపారుపూడి పోలీస్‌స్టేషన్ ముట్టడికి తెలుగు తమ్ముళ్లు యత్నించారు. దీంతో టీడీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. తప్పు చేసిన వారిని అరెస్టు చేయమంటే తమను అడ్డుకోవడం ఏంటంటూ పోలీసులతో టీడీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. దాడికి పాల్పడిన వైసీపీ కార్యకర్తలు (YCP), మాజీ మంత్రి కొడాలి నాని పీఎ లక్ష్మోజిను అరెస్టు చేయాలంటూ రోడ్డుపై ధర్నాకు దిగారు. ఈ క్రమంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు (Ravi Venkateswara Rao), పామర్రు టీడీపీ ఇంచార్జ్ వర్ల కుమార్ రాజా (Varla kumar raja) సహా పలువురు టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ తోపులాటలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావుకు స్వల్ప గాయాలయ్యాయి. 

Updated Date - 2022-09-16T16:35:46+05:30 IST